కారు బోల్తా ఇద్దరు యువకుల మృతి ... ముచ్చర్ల గేటు సమీపంలో ఘటన
ఇబ్రహీంపట్నం, ముద్ర ప్రతినిధి: హైదరాబాద్- శ్రీశైలం జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో హైదారాబాద్ పాతబస్తీకి చెందిన ఇద్దరు యువకులు మృతి చెందారు. హైదరాబాద్ నుంచి కడ్తాల్ వైపు మహేంద్ర ఎక్స్యూవి (టీఎస్09ఈహెచ్0362) వాహనంలో వస్తుండగా కందుకూరు మండలం ముచ్చర్ల గేటు సమీపంలో ఈ ఘటన జరిగింది.
మృతులు పహాడీ షరీఫ్ ప్రాంతానికి చెందిన నయాబ్, ఇంతియాజ్ గా గుర్తించారు. వీరంతా శ్రీశైలం డ్యాం సందర్శనకు వెళ్తున్నట్లు తెలిసింది. మిగతా 5 మంది యువకులు స్వల్ప గాయాలతో ప్రమాదం నుండి బయట పడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న గ్రీన్ ఫార్మా సిటీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.