కోదాడ బైపాస్ లో రోడ్డు ప్రమాదం

కోదాడ బైపాస్ లో రోడ్డు ప్రమాదం
  • గుర్తు తెలియని వాహనం ఢీ కొని వ్యక్తి మృతి

కోదాడ, ముద్ర ప్రతినిధి:- హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారి ఎన్ ఎచ్ 65 పై కోదాడ బై పాస్ లోని కట్ట కొమ్ముగూడెం రోడ్డు సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీ కొనటంతో వ్యక్తి మృతి చెందాడు . మంగళవారం అర్ధరాత్రి ప్రమాదం జరిగి ఉంటుందని , ప్రమాదం జరిగిన తరువాత మృత దేహం పై నుండి వాహనాలు వెళ్లటంతో మృతదేహం గుర్తు పట్టలేని విధంగా తయారయిందని పోలీసులు తెలిపారు . మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోదాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు .