గుజరాత్ తీరంలో రూ. 600 కోట్ల డ్రగ్స్ సీజ్

గుజరాత్ తీరంలో రూ. 600 కోట్ల డ్రగ్స్ సీజ్

Rs. 600 crore worth drugs seized : గుజరాత్ రాష్ట్రంలోని పోర్ బందర్ పోర్టుకు సమీపంలో ఇండియన కోస్ట్ గార్డ్ (ICG) పాకిస్థాన్ నుంచి వస్తున్న ఒక పడవను పట్టుకుని, అందులో అక్రమంగా రవాణా చేస్తున్న రూ.600 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలు (DRUGS) పట్టుకున్నారు. డ్రగ్స్ తరలిస్తున్న 14 మంది పాకిస్థానీయులను పట్టుకుని అరెస్టు చేసింది. మాదక ద్రవ్యాలు తరలిస్తున్నట్టు అందిన పక్కా సమాచారం మేరకు యాంటీ టెర్రరిజమ్ స్క్వాడ్ (ATS), నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) బృందాలతో కలిసి ఇండియన్ కోస్ట్ గార్డ్ తనిఖీలు చేసింది. పాకిస్థాన్ నుంచి వస్తున్న పడవలో రూ. 600 కోట్ల విలువైన మాదకద్రవ్యాలు ఉన్నట్టు గుర్తించిన ఈ తనిఖీ బృందం నిందితులను అరెస్టు చేసి, ఆ డ్రగ్స్ ను సీజ్ చేసింది. నిందితులను అదుపులోకి తీసుకుంటున్న సమయంలో వారు తీర గస్తీదళం సిబ్బందిపై కాల్పులకు తెగబడినట్టు సమాచారం.