గ్రామీణ యువతీ, యువకులుఐ ఏఎస్, ఐపీఎస్ లక్ష్యంగా చదవాలి

గ్రామీణ యువతీ, యువకులుఐ ఏఎస్, ఐపీఎస్ లక్ష్యంగా చదవాలి

పోలీస్ శాఖ సహకారం అందిస్తుందని భరోసా

రామగుండం సీపీ. రాజేశ్వరి

ముద్ర, ప్రతినిధి, మంచిర్యాల: మారుమూల గ్రామాల నిరుద్యోగ యువతి, యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి పోలీస్ శాఖ తమవంతు సహకారం అందిస్తుందని రామగుండం సీపీ రెమా రాజేశ్వరి భరోసా ఇచ్చారు. సోమవారం కోటపల్లి, జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు గ్రామాల్లో కమ్యూనిటీ పోలీస్ లో భాగంగా పోలీస్ లు, మీ కోసం కార్యక్రమం ఏర్పాటు చేయగా  సీపీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా సీపీ మాట్లాడుతూ, గ్రామాల్లోని యువతీ ,యువకులు ఉన్నత విద్యను అభ్యసించాలని ఆమె కోరారు. ఉన్నత విద్యకు అవసరమైన పోటీ పరీక్షల స్టడీ మెటీరియల్ సరఫరా చేయడంతో పాటు కోచింగ్ ఇప్పించడానికి సహకరిస్తామని ఆమె తెలిపారు.

ప్రతి ఒక్కరు ఐ ఏఎస్, ఐపీఎస్ సాధించడమే లక్ష్యంగా చదవాలని సూచించారు. నిరుద్యోగులకు ప్రభుత్వ లేదా ప్రయివేటు సంస్థల్లో ఉద్యోగం వచ్చేలా పోలీస్ లు సహకరిస్తారని ఆమె తెలిపారు. గతంలో పోలీస్ లను చూసి ప్రజలు దూరంగా వెళ్ళేవారని ప్రస్తుతం పోలీస్ శాఖ ప్రజల్లో మమేకం కావడం లక్ష్యం తో ఉందని అన్నారు. గ్రామాల్లోని మహిళలకు చీరలను, బియ్యం, యువకులకు వాలీబాల్ కిట్స్ ను సీపీ రాజేశ్వరి అందజేశారు.