అంగన్వాడి కేంద్రంలో కూతుర్ని, ప్రభుత్వ పాఠశాలలో కుమారుడిని చేర్చిన  ఎస్సై కె రాణి

అంగన్వాడి కేంద్రంలో కూతుర్ని, ప్రభుత్వ పాఠశాలలో కుమారుడిని చేర్చిన  ఎస్సై కె రాణి

ముద్ర.వీపనగండ్ల :- ప్రభుత్వ పాఠశాలలో అర్హత గల ఉపాధ్యాయులచే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని నమ్మకంతో తన కుమారుడిని, కూతుర్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్చి తోటి ఉద్యోగస్తులకు ఆదర్శంగా నిలిచారు వీపనగండ్ల ఎస్ఐ కే రాణి. వీపనగండ్ల పోలీస్ స్టేషన్లో ఇటీవల ఎస్ఐ గా బాధ్యతలు స్వీకరించిన ఎస్సై కె రాణి తన భర్త తిరుమలేష్ తో కలిసి కూతురు అభిజ్ఞ ను వీపనగండ్ల లోని మూడవ అంగన్వాడి సెంటర్లో,కుమారుడు విరాట్ నందన్ ను ఎం ఆర్ సి ప్రాథమిక పాఠశాలలో చేర్పించారు.ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య బోధించడం జరుగుతుందని, అంగన్వాడి సెంటర్లో ఆటపాటలతో బోధించడం జరుగుతుందని ఉద్దేశంతో ఎస్సై కె, రాణి భర్త తిరుమలేష్ పిల్లల ను చేర్పించారు.

ఈసందర్భంగా ఎస్సై రాణి  అంగన్వాడి కేంద్రంలో చార్ట్, బోర్డులను తిలకిస్తూ సెంటర్ పరిసరాలను పరిశీలించారు.ఎస్ఐ మాట్లాడుతూ తాను చిన్నప్పుడు ప్రభుత్వ పాఠశాల లో చదవడం జరిగిందని, ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య బోధించడం జరుగుతుందని,తల్లిదండ్రులు తమ పిల్లల ను ప్రైవేటు పాఠశాలలకు పంపకుండా ప్రభుత్వ పాఠశాలలనే చేర్పించాలని అన్నారు.  అంగన్వాడి సెంటర్లో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొన్నదని ఎస్సై సంతోషం వ్యక్తం చేశారు. ఎస్సైని స్ఫూర్తిగా తీసుకొని మండలంలోని పాఠశాలలో వివిధ శాఖల అధికారులు కూడా తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తే బాగుంటుందని పలువురు  ఆశాభావం వ్యక్తం చేశారు.కార్యక్రమంలో అంగన్వాడి సూపర్వైజర్, అంగన్వాడీ టీచర్ కమల, ఆయా రాధమ్మ తదితరులు ఉన్నారు.