మినీ అండర్ పాస్ వద్ద ట్రాఫిక్ కి చెక్ పెట్టిన ఎస్ఐ సాయిరాం.

మినీ అండర్ పాస్ వద్ద ట్రాఫిక్ కి చెక్ పెట్టిన ఎస్ఐ సాయిరాం.
  • మినీ అండర్పాస్ నుంచి ఫోర్ వీలర్స్ వెళ్లకుండా స్టాపర్స్ ఏర్పాటు
  •  ట్రాఫిక్ తిప్పలు తప్పాయంటు ఆనందం వ్యక్తం చేస్తున్న ద్విచక్ర వాహనదారులు

సూర్యాపేట ముద్ర ప్రతినిధి:- సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 65 నెంబర్ జాతీయ రహదారి సర్వీస్ రోడ్డుపై రిజిస్ట్రేషన్ ఆఫీస్ సమీపంలో ఉన్న మినీ అండర్ పాస్ వద్ద ట్రాఫిక్ కు  సమస్యకు ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం ప్రత్యేక చర్యలు చేపట్టారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం సమయంలో మినీ అండర్ పాస్ నుంచి ఫోర్ వీలర్స్,  ఆటోలు వెళుతుండడంతో తీవ్ర ట్రాఫిక్ సమస్యలు ఏర్పడి ద్విచక్ర వాహనదారులు,  పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతుండేవారు. దీంతో విషయం తెలుసుకున్న ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం మినీ అండర్ పాస్ నుంచి మద్యకు ద్విచక్ర వాహనాలు మాత్రమే వెళ్లేలా  స్టాపర్స్ ను ఏర్పాటు చేసి ఫోర్ వీలర్స్, ఆటోలు వెళ్లకుండా చర్యలు చేపట్టారు. దీంతో అండర్ పాస్ నుంచి రోడ్డు దాటేవారికి ట్రాఫిక్ సమస్యలు తొలగి ప్రయాణం సాఫీగా సాగానుంది. మినీ అండర్ పాస్ వద్ద ట్రాఫిక్ ను నియంత్రించేందుకు స్టాపర్స్ ఏర్పాటు చేయడం పట్ల వాహనదారులు ప్రజలు ఆనందంగా వ్యక్తం చేస్తూ ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాంకు కృతజ్ఞతలు తెలిపారు.