సాధించిన తెలంగాణా పరిరక్షణే గురుతర బాధ్యత - ఎస్పి జానకీ షర్మిల

సాధించిన తెలంగాణా పరిరక్షణే గురుతర బాధ్యత - ఎస్పి జానకీ షర్మిల

ముద్ర ప్రతినిధి, నిర్మల్: దశాబ్దాల పోరాటం, త్యాగాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరుపుకోవడం ఆనందంగా ఉందని నిర్మల్ ఎస్పి జానకీ షర్మిల అన్నారు. ప్రత్యేక తెలంగాణ భద్రత, బాధ్యత పోలీసు శాఖ చేతిలో ఉందని ఆమె పేర్కొన్నారు.  తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాణ్ణి పురస్కరించుకొని క్యాంపు కార్యాలయం, జిల్లా పోలీస్ కార్యాలయం సాయుధ ధళ కార్యాలయాల్లో గౌరవ వందనం స్వీకరణ అనంతరం జిల్లా ఎస్పీ జి. జానకి షర్మిల జాతీయ పతాకావిష్కరణ గావించారు.

అనంతరం జిల్లా ఎస్పి జిల్లా పోలీసులకు, ప్రజలకు, అధికారులకు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ఎంతో మంది అమరుల త్యాగాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చే గురుతర బాధ్యత పోలీస్ శాఖ పై  ఉందన్నారు. పోలీస్ సిబ్బంది మరింత బాధ్యతతో పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో ప్రజలందరికీ ఒకే రకమైన సేవలు అందించాలన్నారు. ఈ సమావేశంలో భైంసా ఎఎస్పీ కాంతిలాల్ పాటిల్, నిర్మల్ డిఎస్పీపీ  గంగారెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ , నిర్మల్ రూరల్ సీఐ, ఆర్ఐలు , ఆర్ఎస్ఐ లు, ఎస్ఐలు, ఎస్బీ, కార్యాలయ సిబ్బంది,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.