విచ్ఛిన్న కర శక్తుల నుండి దేశాన్ని కాపాడుకోవాలి ... ఎస్పీ జానకి షర్మిల
ముద్ర ప్రతినిధి, నిర్మల్: దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకునే శక్తులనుండి మన దేశాన్ని కాపాడుకునేందుకు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ జానకి షర్మిల అన్నారు. 78వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా పోలీస్ కార్యాలయంలో యస్పి జానకి షర్మిల జాతీయ జెండాను ఎగరవేసి, సిబ్బందితో కలిసి జాతీయ గీతాలాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సిబ్బందికి, జిల్లా ప్రజలకు 78వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేశారు.
మాతృ భూమి కోసం ఎందరో మహనీయులు తమ ప్రాణాలను తృణప్రాయంగా వదిలేసి బ్రిటిష్ వారితో పోరాడి, మనకు సమకూర్చి పెట్టిన ఈ స్వాతంత్ర్య భారత్ నేటితో 77 వసంతాలను పూర్తి చేసుకుందని అన్నారు. ఈ సందర్భంగా ఆ మహనీయులను స్మరించు కోవాల్సిన అవసరం ఎంతగానో ఉందన్నారు.
బానిస సంకెళ్ళు తెంచుకొని సాధించుకున్న ఈ స్వతంత్ర భారతాన్ని, రాజ్యాంగాన్ని కొన్ని శక్తులు విచ్చిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్నాయన్నారు. వారి నుండి మన దేశాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, పోలీసుల పాత్ర చాలా కీలకమన్నారు. మన విధులను సక్రమంగా నిర్వహించినప్పుడే బార్డర్లో సైనికులు అందించే సేవలకు మన సేవలు ఏమాత్రం తీసుపోవని గుర్తు చేస్తూ, మన విధులను అంకితభావంతో నిర్వహించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఏ ఎస్పి అవినాష్ కుమార్ , డిఎస్పీ గంగా రెడ్డి, ఇన్స్పెక్టర్ లు ప్రవీణ్ కుమార్, నవీన్ కుమార్, గోపీనాథ్, రామకృష్ణ, ఆర్.ఐ. లు రామనిరంజన్, శేఖర్, రమేష్, రామ కృష్ణ, డి.పి.ఒ ఏ ఓ యోనోస్ అలి, సూపరింటెండెంట్ లు శ్రీనివాస్ ఎస్ఐ లు , అర్ ఎస్ఐ లు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ పథకాలకు ఎంపికైన వారిని అభినందించారు. ఉత్తమ సేవా పతకం: హెడ్ కానిస్టేబుళ్లు జె రాందాస్, జ్యోతిరామ్, జె.బాలాజీ
సేవా పతకం: డిఎస్పి గంగారెడ్డి , ఎస్ఐ ఎండి గౌస్, ఏఎస్ఐ లు ఎల్ దేవ్, సుదర్శన్, ఏఆర్ఎస్ఐ లు సాహెబ్ రావు, గుణ్వంత్, విజయ రావు, ఏ ఆర్ హెడ్ కానిస్టేబుల్స్ శంకర్, రాజేశ్వర్, అంబవ్రావు, ఉత్తమ్. పొందారు.