ఎన్నికలలో పోలీసుల పనితీరు అభినందనీయం -ఎస్పీ ప్రవీణ్ కుమార్

ఎన్నికలలో పోలీసుల పనితీరు అభినందనీయం -ఎస్పీ ప్రవీణ్ కుమార్

ముద్ర ప్రతినిధి, నిర్మల్: ఇటీవల జరిగిన ఎన్నికల్లో సమన్వయంతో పనిచేసి ఎన్నికలను విజయవంతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించిన పోలీస్ అధికారులు, సిబ్బంది పనితీరు అభినందనీయమని ఎస్పీ ప్రవీణ్ కుమార్ కొనియాడారు. ఎన్నికల విజయంగా నిర్వహించడంలో శ్రమించిన పోలీస్ అధికారులు, సిబ్బందికి ఆయన  ప్రశంసా పత్రాలను గురువారం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎలాంటి సంఘటనలు జరగకుండా పూర్తిగా ప్రశాంత వాతావరణంలో ఎన్నికల విధుల నిర్వహణలో అధికారులు, సిబ్బంది శ్రమించిన తీరు స్ఫూర్తిదాయకంగా నిలిచిందన్నారు. ఈ ఎన్నికల్లో పోలీసులు ఇతర ప్రభుత్వ శాఖలతో సమన్వయంతో  పనిచేయడం ద్వారా ఎన్నికల నిర్వహణ మరింత సులభతరం అయిందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ వీరన్న, ఏఎస్పీ భైంసా కాంతిలాల్ పాటిల్ ఐపిఎస్., అదనపు ఎస్పీ (ఏఆర్) వెంకటేశ్వర్లు, సిసిఆర్బి రవీందర్ రెడ్డి, ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఇన్స్ స్పెక్టర్లు పురషోతం చ్యారి, మోహన్, నైలు, వినోద్, నవీన్ కుమార్, ఆర్ఐలు రాంనిరంజన్, రమేష్, రామకృష్ణ, యంటిఓ వినోద్, ఐటి కోర్ ఎస్ఐ రవి కుమార్, సబ్ ఇన్స్ స్పెక్టర్లు, ఇతర పోలీస్ సిబ్బంది వున్నారు.