చలి తీవ్రత, మంచు ప్రభావం ఎక్కువగా ఉన్నది

చలి తీవ్రత, మంచు ప్రభావం ఎక్కువగా ఉన్నది
  • తెల్లవారుజామున రోడ్లపై ప్రయాణ జాగ్రత్తలు తీసుకోవాలి
  • రోడ్డు భద్రత, ప్రమాదాల నివారణ ప్రతిఒక్కరి సమాజిక బాధ్యత
  • రాహుల్ హెగ్డే, ఎస్పి సూర్యాపేట

ముద్ర ప్రతినిధి సూర్యాపేట:-చలి తీవ్రత ఎక్కువ గా ఉన్నందున తెల్లవారుజామున మంచు ప్రభావం ఎక్కువగా ఉంటుందని, ఈ సమయంలో వాహనాలు నడిపేవారు, ప్రయాణం చేసేవారు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, ప్రమాదాల బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే బుధవారం ఒక ప్రకటనలో తెలిపినారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసు, సంభందిత అధికారులు కృషి చేస్తున్నారని, రోడ్డు ప్రమాదాల నివారణలో అందరూ భాగస్వామ్యమై ప్రమాదాలను నివారించాలని ఎస్పీ  విజ్ఞప్తి చేశారు. రోడ్డు భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణ అనేది పౌరుల సామాజిక బాధ్యత అని గుర్తు చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నామని, రోడ్లపై జంక్షన్ ల వద్ద లైంటింగ్ పెంచడం, హైవేపై నిరంతర పెట్రోలింగ్ చేయాలని, రహదారి వెంట ఉన్న గ్రామాల ప్రజలకు అవగాహన కల్పించాలని పోలీసు సిబ్బందిని ఎస్పీ ఆదేశించారు. సంభందిత అధికారులు, స్టాక్ హోల్డర్స్ తో సిబ్బంది సమన్వయంగా పని చేసి రోడ్డు ప్రమాదాలను నివారించాలని సూచించారు.

 పొగమంచు ఉన్న సమయంలో వాహనదారులు పాటించాల్సిన జాగ్రత్తలు

వాహనాలకు లైటింగ్ కండిషన్ ఉండాలనీ, మంచు ఎక్కువగా ఉన్నప్పుడు హెడ్ లైట్ తక్కువ ఎత్తులో ఉండాలన్నారు.
వాహనాలను తక్కువ వేగంతో నడపాలనీ,
 వాహనంలో పాటలు, మ్యూజిక్ పెట్టుకోవద్దనీ, ఇతర వాహనదారులు చేసే హరన్లు, వాహన శబ్దాలను గమనించాలన్నారు.
 మీ వాహనంను రహదారిపై కచ్చితమైన, నిర్ధిష్టమైన మార్గంలో డ్రైవ్ చేయాలనీ, ఇతర వాహనదారులకు ఇబ్బంది కలిగే విధంగా లైన్ క్రాస్ చేయవద్దన్నారు.

లైన్ క్రాస్ చేసేటప్పుడు, మూలమలుపులు తిరిగేటప్పుడు వెనుక ఉన్న వాహనదారులకు అర్థమయ్యేలా మీ వాహనం ఇండికేటర్ ను వెయ్యాలనీ,
 వాహనాల గ్లాస్ లపై తేమ, నీటి బిందువులు లేకుండా చూసుకోవాలనీ,
వేగంగా ఇతర వాహనాలను ఓవర్ టేక్ చేయవద్దనీ,
 వాహనాల మధ్య దూరం పాటించాలనీ, ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండి ముందు, వెనుక వాహనాలను, జంక్షన్ ల వద్ద రద్దీని, చిన్న వాహనాలను, బాటసారులను, పశువులను గుర్తించాలన్నారు. రోడ్డుపై, డ్రైవింగ్ పై దృష్టి పెట్టాలనీ,మంచు ప్రభావం ఎక్కువగా ఉన్నదనీ,
 తెల్లవారుజామున రోడ్లపై ప్రయాణ జాగ్రత్తలు తీసుకోవాలనీ, 
రోడ్డు భద్రత, ప్రమాదాల నివారణ ప్రతిఒక్కరి సా మాజిక బాధ్యత అని ఎస్పి రాహుల్ హెగ్డే సమగ్రంగా వివరించారు.