పూర్తిస్థాయి పరిహారం కోసం కలెక్టరేట్ భవనం 

పూర్తిస్థాయి పరిహారం కోసం కలెక్టరేట్ భవనం 

ఎక్కి నిరసన తెలిపిన రైతులు


సిద్దిపేట : ముద్ర ప్రతినిధి సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ భవన నిర్మాణంలోభూములు కోల్పోయిన రైతులు పూర్తిస్థాయి పరిహారం కోసం అదే కలెక్టరేట్ భవనం ఎక్కి నిరసన తెలిపారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... సిద్దిపేట కలెక్టరేట్ నిర్మాణం కోసం సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడ, రాంపల్లి శివారులోనీ రైతుల నుండి భూమిని ప్రభుత్వం సేకరించింది. రైతులకు అప్పటి కలెక్టర్ వెంకట్రాంరెడ్డి భూమి కోల్పోయిన వారి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం, 200 గజాల ప్లాటు, బోరుబావులకు, పండ్ల తోటలకు నష్టపరిహారం ఇస్తామని హామీ ఇచ్చారన్నారు. ఈ విషయమై పలుమార్లు అధికారులకు విన్నవించిన ఎవరు పట్టించుకున్న పాపాన పోలేదన్నారు.  

సోమవారం ప్రజావాణిలో వినతి పత్రం ఇవ్వడానికి ప్రయత్నించారు. ప్రజావాణి జరుగుతున్న హాల్లోకి వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు వారిని అడ్డుకున్నారు.దీంతోతమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ కలెక్టరేట్ భవన నిర్మాణంలో భూమిని కోల్పోయిన రైతులు కలెక్టరేట్ భవనం ఎక్కి నిరసన తెలిపారు. పోలీసులు వారిని సముదాయించి భవనం కిందకు దించి వేశారు.