బీఆర్ఎస్ లో చేరిన సాంబారి ప్రభాకర్
మెట్‌పల్లి ముద్ర: ఎంపీ, కోరుట్ల నియోజకవర్గ బిజెపి అభ్యర్థి ధర్మపురి అరవింద్ టికెట్ ఇస్తానని నమ్మించి మోసం చేశాడని ఆరోపిస్తూ. బిజెపి పార్టీకి రాజీనామా చేసిన పద్మశాలి రాష్ట్ర నాయకులు మాజీ సర్పంచ్ సాంబారి ప్రభాకర్ తన అనుచరులతో కలిసి కోరుట్ల బీ ఆర్ ఎస్ అభ్యర్థి డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఆధ్వర్యంలో సోమవారం భారత రాష్ట్ర సమితి లో చేరారు. ఈ మేరకు ప్రగతి భవన్ లో మంత్రి కేటీఆర్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీ ఆర్ ఎస్ ప్రభుత్వం లో రాష్ట్రం అభివృద్ధి చెందిందని. మళ్ళీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నారు.కోరుట్ల నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ గెలుపు కోసం కృషి చేస్తానని తెలిపారు.