గ్రామాల్లో సంక్రాంతి పండుగ సంబరాలు ప్రారంభం

గ్రామాల్లో సంక్రాంతి పండుగ సంబరాలు ప్రారంభం
  • నియోజకవర్గ వ్యాప్తంగా భోగి పండుగను ఘనంగా జరుపుకున్న ప్రజలు
  • గ్రామాల్లో మహిళలకు ముగ్గుల పోటీ నిర్వహించిన గ్రామ పెద్దలు
  • పతంగులు ఎగురవేసి సంబరాలు జరుపుకున్న చిన్నారులు
  • గ్రామాల్లో సందడి చేసిన గంగిరెద్దులవారు

తుంగతుర్తి ముద్ర:- సంక్రాంతి పండుగను తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలు అత్యంత ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటున్నారు సంక్రాంతి పండుగ మూడు రోజులుగా ప్రజలు పండగ చేసుకుంటారు మొదటి రోజు భోగి రెండవ రోజు సంక్రాంతి మూడవరోజు కనుమ పండుగగా జరుపుకోవడం అనాదిగా వస్తున్న ఆచారం అందులో భాగంగా ఆదివారం భోగి పండుగను నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో గ్రామాల్లో ఘనంగా జరుపుకున్నారు గ్రామాల్లోని ఇళ్లలో చిన్న పిల్లలకు భోగి పండ్లు పోసి సంబరాలు జరుపుఉన్నారుభోగి పండుగనాడు గ్రామాల్లో గంగిరెద్దులవారు హరిదాసులు ఇల్లు తిరుగుతూ గంగిరెద్దులతో వివిధ రకాల విన్యాసాలు చేయిస్తూ ఆయా ఇళ్ల వారు ఇచ్చే బహుమతులు తీసుకొని వెళ్తారు సంక్రాంతి పండుగను పురస్కరించుకుని గ్రామాల్లో ముగ్గుల పోటీలను ఘనంగా నిర్వహించారు అందమైన రంగవల్లులు వేసిన వారికి ఆయా గ్రామాల గ్రామ పెద్దలు బహుమతులు అందించారు తుంగతుర్తి మండల కేంద్రాల్లోని ఎస్సీ కాలనీలో నిర్వహించిన ముగ్గుల పోటీలలో విజేతలకు మేకర్స్ ఆఫ్ మిల్క్ షేక్ అధినేత తిరుమల ప్రగడ రాహుల్ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కిషన్ రావు జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అనురాధ లు మహిళలకు బహుమతులు అందజేశారు.

అలాగే వెంపటి గ్రామంలో కలం యూత్ కమిటీ ఆధ్వర్యంలో భోగి మంటలు నిర్వహించగా,తుంగతుర్తి తోపాటు పలు గ్రామాల్లో శనివారం సందడిగా జరుపుకున్నారు. దూర ప్రాంతాల నుంచి తరలి వచ్చిన వారు స్వగ్రామాల్లో మిత్రులు, కుటుంబసభ్యులతో కలిసి భోగి మంటలు వేసుకుంటూ ఒకరికొకరు అభినందనలు తెలుపుకున్నారు.పిండి వంటల ఘుమఘుమలు, బంధువులు, కుటుంబసభ్యుల సందడితో పల్లెలు శోభిల్లాయి. కుల, మతాలకు అతీతంగా రైతులు, వ్యవసాయ కూలీలు జరుపుకునే పండుగ కావడంతో సంక్రాంతి పర్వదినాన్ని అన్ని వర్గాల ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఉద్యోగాలు, వ్యాపారాల నిమిత్తం వివిధ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారితో పాటు బంధువుల రాకతో గ్రామాల్లో సందడి వాతావరణం నెలకుంది. పల్లెల్లో ముగ్గుల పోటీలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, నాటకాలు, మ్యూజికల్‌ చైర్స్‌, యువకులు క్రికెట్‌ పోటీలు ఆయా గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో నీర్వహించారు.మహిళలు తమ ఇళ్ల ముందు ఒకరికొకరు పోటీ పడి భోగి ముగ్గులతో తీర్చిదిద్దారు. ఆ ముగ్గులను గొబ్బెమ్మలతో అలంకరించారు. చిన్నా పెద్దా తేడా లేకుండా గాలి పటాలను ఎగుర వేసి ఆనందం వ్యక్తం చేశారు.