సంత్ సేవాలాల్ మహారాజ్ గిరిజన జాతికే కాదు ఇతర కులాలకు ఆదర్శప్రాయుడే ..

సంత్ సేవాలాల్ మహారాజ్ గిరిజన జాతికే కాదు ఇతర కులాలకు ఆదర్శప్రాయుడే ..

ముద్ర, షాద్ నగర్:సంత్ సేవాలాల్ జయంతి కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు మద్దూరి ఫౌండేషన్ చైర్మన్ మద్దూరి అశోక్ గౌడ్....

చౌడమ్మ గుట్ట తండాలో ఘనంగా సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు...

సేవాలాల్ తన పాటలు రచనల ద్వారా ప్రజలను జాగృతం చేయడానికి అనేక ప్రబోధాలను బోధించాడు అని, ముఖ్యంగా బంజారా జాతి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటేలా అహింసా సిద్ధాంతానికి పునాదులు వేశారు అని అందుకే సంత్ సేవాలాల్ ఇతర కులాలవారికి కూడా ఆదర్శమూర్తిగా నిలిచారని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు మద్దూరి ఫౌండేషన్ చైర్మన్ మద్దూరి అశోక్ గౌడ్ అన్నారు. గురువారం సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా చౌడమ్మ గుట్ట తండాలో నిర్వహించిన జయంతి కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని సంత్ సేవాలాల్ మహారాజ్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా గిరిజన నాయకులు మద్దూరి అశోక్ గౌడ్ ను గిరిజన సంస్కృతి సంప్రదాయాల వస్త్రాలను అలంకరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు ఈ సందర్భంగా మద్దూరి అశోక్ గౌడ్ మాట్లాడుతూ సంత్ సేవాలాల్ మహారాజ్ గొప్ప సంఘసంస్కర్త అని అన్నారు, బంజారాల ఆరాధ్యదైవం  ఆధ్యాత్మిక గురువు, బంజారాల సంస్కృతి సంప్రదాయాల పరిరక్షకుడు అని ఆ మహనీయుడు చూపిన మార్గంలో నడిచి ఆయన ఆశయాలను  ఆశయాలను సాధించాలని మద్దూరి అశోక్ గౌడ్ పిలుపునిచ్చారు 

సేవాలాల్ మహారాజు ప్రజల మూఢవిశ్వాసమైన జంతుబలికి తీవ్ర వ్యతిరేకి, జాతి జాగృతి కోసం ఎంతో హితబోధ చేశాడు. తన జాతి వారిని బ్రిటిష్ వారి నుంచి, ముస్లిం వారి నుంచి కాపాడిన ఘనుడు అని,  అందుకే నేడు యావత్ బంజారా జాతి ఆయన జయంతిని ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు అని వివరించారు

సేవాలాల్ జయంతి వేడుకలు జరిగే సమయంలో బంజారాలు తమ జాతి డిమాండ్లు నెరవేర్చాలని ఎన్నో ఏళ్ళుగా ప్రభుత్వాలను విజ్ఞప్తి చేస్తూనే ఉన్నారు అని  ప్రధానంగా గోరబోలి బాషాను 8వ షెడ్యూల్‌లో చేర్చాలని, అలాగే ఫిబ్రవరి 15న ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలని కోరుతున్నారు. ఈ విజ్ఞప్తులను అటు కేంద్రం ఇటు రాష్ట్రం నెరవేర్చడం లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు బంజారాల కోసం ఇది చేశాం అది చేశాము అని చెబుతున్నారే తప్ప వారి చిరకాల కోరికలను?ప్రభుత్వాలు నెరవేర్చడం లేదు అని, ఎవరికైనా సంక్షేమ పథకాలు ముఖ్యమే కానీ తమ జాతి గుర్తింపును భావితరాలకు అందించాల్సిన అవసరం ఉంది అని అన్నారు.

తెలంగాణ ప్రభుత్వం కొత్త సెలవులుగా రంజాన్, గురునానక్ జయంతిని ప్రకటించినట్టే సేవాలాల్ జయంతి రోజును కూడా సెలవుగా ప్రకటించాలి అనిడిమాండ్చేశారు. తరతరాల నుంచి అన్యాయానికి గురయిన జాతులను రక్షించే బాధ్యత ప్రభుత్వాలదే అని అలాగే బంజారా సమాజం సేవాలాల్ సూత్రాలను గొప్పగా చెప్పుకోవడమే కాకుండా ఆచరించి చూపాలి అని   చెప్పారు.