కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుంది... ఏఐసీసీ సభ్యులు    రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి

కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుంది...   ఏఐసీసీ సభ్యులు    రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి
  • ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు సయ్యద్ కుటుంబాన్ని పరామర్శించిన సర్వోత్తమ్ రెడ్డి

తుంగతుర్తి మండల కేంద్రంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎస్కే సయ్యద్ కుటుంబ సభ్యులను ఏఐసీసీ సభ్యులు రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి పరామర్శించారు. సయ్యద్ మృతి కాంగ్రెస్ పార్టీకి తీరనిలోటని వారి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని అన్నారు. వారి కుటుంబ సభ్యులకు మనో ధైర్యం చెబుతూ సయ్యద్ మృతి పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
అనంతరం మండల కేంద్రంలోని షేక్ లాల్ కుమారుడి తలకు శస్త్ర చికిత్స జరగడంతోవారి ఇంటికి వెళ్లి పరామర్శించారు.

దశాబ్దాల కాలంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా ఉంటూ కాంగ్రెస్ పార్టీకి సేవలందించిన అన్ని కుటుంబాలకు తాము ఎల్లవేళలా అందుబాటులో అలాగే అండగా ఉంటామని సర్వోత్తమ్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా సర్వోత్తమ్ రెడ్డి వెంట గ్రామ శాఖ అధ్యక్షుడు ఉప్పుల రాంబాబు, జిల్లా కాంగ్రెస్ నాయకుడు పెండెం రామ్మూర్తి ,కాంగ్రెస్ నాయకులు పెద్దబోయిన అజయ్ కుమార్ ,కొండరాజు, అక్కినపల్లి రాములు, ఎండి అబ్దుల్, అక్కినపల్లి నరేష్, ఎస్కే హుస్సేన్ ,వెంకన్న, అఫ్జల్, జిలాని వంశీ కరీం తదితరులు పాల్గొన్నారు