అంగన్వాడి కేంద్రంలలో  ఘనంగా స్కూల్ డే కార్యక్రమలు...

అంగన్వాడి కేంద్రంలలో  ఘనంగా స్కూల్ డే కార్యక్రమలు...

గొల్లపల్లి.ముద్ర:- గొల్లపల్లి మండల పరిధిలో గోవిందుపల్లె చిల్వా కోడూరు.పలు గ్రామాల్లో మంగళవారం అంగన్వాడీ కేంద్రంలలోఐసిడిఎస్ సూపర్వైజర్ ఆధ్వర్యంలో ఘనంగాస్కూల్ డే కార్యక్రమం నిర్వహించిన్నారు.

ఈ స్కూలు కార్యక్రమంలో మూడు నుంచి ఆరు సంవత్సరాల పిల్లల యొక్క తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేసి  మంచి అలవాట్లు సంభాషణ ఆటలు పాటలు కథ సంభాషణ శాస్త్రీయ పరిజ్ఞానం   మొదలైన కార్యక్రమాలు తల్లుల ఆధ్వర్యంలో పిల్లలతో చేపించి చూపించడం జరిగినది.పిల్లలకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రీస్కూల్ విద్య ప్రాముఖ్యత బాల్యారంబదశ  అతి ముఖ్యమైన భాగాలలో  పూర్వ ప్రాథమిక విద్య ఒకటి ఇది ఐసిడిఎస్ కు మూల స్తంభం లాంటిదని అన్నారు. ఈ కార్యక్రమంలో  అంగన్వాడీ సూపర్వైజర్ మమత  డిస్టిక్ మిషన్ కోఆర్డినేటర్ అశ్విని.స్పెషలిస్ట్ ఫైనాన్స్ లిట్రసి హేమ జెండర్ స్పెషలిస్టు గౌతమి.హెచ్ఎం .అంగన్వాడీ టీచర్స్ విజయ, నర్మద, గంగ భవాని.  సరోజన. సిఏలు వాణి. సులోచన, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.