మూస చదువులతో శాస్త్రీయ విజ్ఞానం- కొరబడుతుంది!

మూస చదువులతో శాస్త్రీయ విజ్ఞానం- కొరబడుతుంది!
Scientific knowledge with stereotyped readings - measured!

ఒక్క అపజయం పది విజయాలకు నాంది అంటారు. అంటే ఒక్కసారి అపజయం పొందినవారు ఆపై వరుసగా పది విజయాలు సాధిస్తారని కాదు. ఏదైనా అపజయం కలిగితే అక్కడే ఆగిపోకుండా, పట్టుదలతో మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తే విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా అని భావం! ఇతర జీవులకు, మనిషికి ఉండే తేడాలు రెండు. మొదటిది ఆలోచన, రెండవది ఊహించడం. ఈ రెండు ఉన్న జీవి మానవుడు మాత్రమే అందుబాటులో ఏ పని చేయాలన్నా ఒకటికి పదిసార్లు ఆలోచించడం, లేని విషయాలను సైతం ఊహించుకోవడం!. ఈ విశ్వ ప్రపంచం సైన్స్ సూత్రాలపై ఆధారపడి మొనగాడు సాగిస్తుంది. వ్యక్తిగతమైన విశ్వాసాలను పక్కనపెట్టి శాస్త్రీయంగా ఆలోచన చేసిన దేశాలు జాతులు అభివృద్ధిలో ముందున్నాయి. అలా అభివృద్ధి చెందుతున్న దేశాలలో, సాంప్రదాయక విద్యా విధానం,( మూస పద్ధతి) విద్య బోధన, విద్యా పట్టణ విద్యార్థులలో, యువతలో శాస్త్రీయ ఆలోచనలు లేకుండా చేస్తున్నాయి.

శాస్త్రీయంగా ఆలోచించే వారిని, ప్రశ్నించే వారిని అభివృద్ధి నిరోధకులుగా చిత్రీకరించి ముద్ర వేయడం సమాజానికి పెద్ద ప్రమాదం పొంచి ఉంది. ప్రపంచంలోకెల్లా భారతదేశంలో వచ్చినా “కుదుపులో” ముఖ్యంగా క్రీస్తుపూర్వం ఆరో శతాబ్దంలో వచ్చిన బౌద్ధమతం వర్ణ వ్యవస్థ పై, విగ్రహారాధనపై తీసుకువచ్చిన సామాజిక మార్పు ఈ సమాజంపై ఎంతగానో ప్రభావం చూపిందని చెప్పవచ్చు. అప్పటివరకు వర్ణవ్యవస్థ విస్తృతంగా కొనసాగుతున్న తరుణంలో బౌద్ధమతం బుద్ధుని బోధనలు ఈ సమాజంలో ఒక సంస్కరణాలు తీసుకురావడానికి అవకాశం ఏర్పడింది. బుద్ధుడి బోధనలో సైన్స్ మిళితమై ఉంది. ఏడవ శతాబ్దంలో ముస్లింలు రావడం ఇక్కడ కులాంతర విహారాలు, మతం మార్పు చోటు చేసుకుంది. మత విశ్వాసాలు కులాంతర వ్యూహాలు సమాజంలో మార్పులు తీసుకువచ్చాయి. క్రైస్తవ మతం తర్వాత చదువుకోవడం ముఖ్యంగా చదువుకోవడానికి అవకాశం కల్పించిన క్రైస్తవ మతం అని చెప్పాలి దేశానికి ఒక దిశ నిర్దేశాన్ని తీసుకురావడంలో ఆంగ్లేయులు ముఖ్యంగా ఆధునిక పరిపాలన విధానం సాంప్రదాయక వ్యవస్థ పై ఆంగ్ల పరిపాలన ప్రభావాన్ని చూపించండి అని చెప్పవచ్చు.

1950లో భారతదేశంలో రాజ్యాంగ వ్యవస్థ ఈ దేశంలో చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరికి సమాన న్యాయం ఆధునిక విద్యా బోధన మానవ హక్కులు ఇవన్నీ కూడా రాజ్యాంగం కల్పించిన విధానమని చెప్పవచ్చు! అయితే తరతరాలుగా వచ్చిన సాంప్రదాయక వ్యవస్థ పై కొంతవరకు సైన్స్ తో కూడిన విధానం కొనసాగుతున్నప్పటికీ గ్రామీణ ప్రాచీన జీవన వ్యవస్థ పూర్తిగా సైన్స్ తోనే ఎండిపోయింది అయితే చాందస్తవాదులు తమ అనుకూల విధానాలతో సామాజిక వ్యవస్థ పై తీవ్రమైన ప్రభావాన్ని తీసుకురావడంలో కృతజ్ఞులైనారని చెప్పాలి. ఇటువంటి వ్యవస్థను సంస్కరించడానికి సైన్స్ ఎంతగానో దోదపడుతుంది దీనికి ఆధునిక విద్యా విధానం ఎంతగానో అవసరం ఉంటుంది.! శాస్త్ర సాంకేతిక రంగాలలో ప్రపంచ దేశాలకు భారతదేశ గా పయనిస్తుందని ప్రభుత్వ వర్గాలు కొన్నేళ్లుగా మొత్తుకుంటున్నాయి. ప్రతి ఏటా భారీగా పచురితమవుతున్న పరిశోధన పత్రాలను కూటంకిస్తూ అవి అలా ఊదరగొడుతున్నాయి. విజ్ఞాన శాస్త్ర సంద్రాన్ని లోతుగా మదించి నవ్య ఆవిష్కరణల అమృత బండాన్ని సాధించడాన్ని ఆయా పరిశోధనలు ఏ మేరకు సపెర్లీకృతం అవుతున్నాయి అన్న ప్రశ్న తలెత్తక మానదు. భారత ప్రభుత్వ ప్రధాన వైజ్ఞానిక సలహాదారు ఆచార్య అజయ్ కుమార్ సూత్ ఇటీవల నాగపూర్ విశ్వవిద్యాలయం వేదికగా సాగిన 108వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్లో మాట్లాడుతూ మన శాస్త్రీయ ప్రచరణల నాణ్యత పై పెదవి వేర్చారు. అత్యుత్తమ పరిశోధనలు నిలువు కాలేకపోతున్న ఇండియా 2020 విజ్ఞాన శాస్త్ర సూచి( జీకే ఐ) లో 138 దేశాలకు గాను 75 వ స్థానంలో సరిపుచ్చుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. దక్షిణ కొరియా, జపాన్ లో పది లక్షల జనాభాకు 7 498,5304 మంది చొప్పున పరిశోధకులు పనిచేస్తున్నారు.

140 కోట్ల జనాభా కలిగిన భారతదేశంలో ఆ సంఖ్య కేవలం 255 మార్కుల ర్యాంకుల చక్రంలో ఇరుక్కుపోయిన మన విద్యా వ్యవస్థ ఉందని చెప్పవచ్చు! ఆసక్తి కలిగిన యువతకు సరి అయిన ప్రోత్సహం లేకపోవడం ముఖ్యంగా విద్యా వ్యవస్థలో నెలకొన్న మూస పద్ధతి( దానిని బట్టి పద్ధతి) అని అంటారు. విజ్ఞాన శాస్త్రం, సామాజిక శాస్త్రం, మానవీయ శాస్త్రాలు ఇక ఆధునిక విద్యావ్యవస్థలో లేకుండా పోవడం ప్రస్తుతం మన చర్చించుకుంటున్న వ్యవస్థకు నిదర్శనం అని చెప్పాలి. వ్యవసాయ రంగంలో కొంతవరకు ఆధునిక విధానం అమలులోనికి వచ్చింది ముఖ్యంగా భారత్లో జన్ను మార్పిడి (జిఎం) పత్తిలో బిజీ వన్ బిజీ టు అని రెండు రకాల వంగడాలను సావుకు మాత్రమే కేంద్రంలో గతంలో అనుమతించింది. కలుపు మొక్కలను నాశనం చేసే విషపూరితమైన రసాయనాలను చల్లిన తట్టుకొని బతికే  అర్బిసైడ్ , ట లా రెంట్( హెచ్ టి) పత్తి వంగడాలను ఇండియాలో సాగుకు అనుమతించాలని అమెరికాకు చెందిన మూన్ షాట్ కంపెనీ ప్రభుత్వ అనుమతిని కోరింది. ఈ దరఖాస్తు పై నిర్ణయం తీసుకోక ముందే ఆ సంస్థ హఠాత్తుగా దాన్ని ఉపసంహరించుకుంది.

ఆ తర్వాత ఆ సమస్త విత్తనాలు అక్రమంగా మార్కెట్ లోనికి చొరబడ్డాయి. సాగులో కలుపు మొక్కలను నివారించడానికి విషపూరితమైన రసాయనం “గ్లైపోసెట్” పంటల పైన తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. రైతుల ఆరోగ్యానికి తీవ్రమైన హాని కలిగిస్తుంది. ఇటువంటి ప్రమాదకరమైన రసాయనాలు భారతదేశంలో విచ్చలవిడిగా అమ్ముడుపోతుంటే దీనికి వ్యతిరేకంగా ప్రభుత్వం తీసుకునే చర్యలు మాత్రం శూన్యం భారతీయ ఆధునిక సైన్స్ వ్యవసాయ రంగంలో వచ్చిన మార్పులు అమలు చేయడానికి ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి. వాతావరణం ఇక్కడ భూములకు అనువైన వంగడాలను సృష్టించుకుంటేనే ఆహార ఆర్థిక భద్రతకు పూచికత్తు లభిస్తుంది. వ్యవసాయ విశ్వవిద్యాలయాలు జాతీయ వ్యవసాయ పరిశోధన సంస్థలు ఆవిష్కరించే కొత్త వంగడాలు సాగుకు ముందుకు వచ్చే రైతాంగం వాటిని ఉపయోగించకుండా ప్రమాదకరమైన బీటీ విత్తనాలను వినియోగించుకునే విధంగా మార్కెట్ వ్యవస్థ ఉంది. తెగుళ్లను ఇతర సమస్యలను నియంత్రించి అధిక దిగుబడులను ఇచ్చే కొత్త వంగడాలను సృష్టించాలంటే ఆధునిక సైన్స్ అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. దీనికి ప్రభుత్వ ప్రోత్సాహం తప్పనిసరి అని చెప్పాలి. అలా కాదని జిఎం పొంగడాలు మేల్ అంటూ బౌల జాతి కంపెనీలు చేసే ప్రచారంలో చిక్కుకుంటే చివరికి బలయేది మన అన్నదాతలు వ్యవసాయ రంగమే. కాబట్టి శాస్త్రీయ విజ్ఞానం సైన్స్ సామాజిక కోణంలో అభివృద్ధిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది.

 దేశంలో సాధారణ వాతావరణం ఇలా ఉండగా. జనవరి 3న సైన్స్ కాంగ్రెస్ ని ప్రధాని ప్రారంభిస్తూ భారతదేశ మరింతగా సృజనాత్మకత శాస్త్రాన్ని పెంపొందించాలని ఉత్కటించారు. అయితే సైన్స్, వర్సెస్ విశ్వాసం( మత విశ్వాసం) వైపు ఎవరు మళ్లీ పోవద్దని ఆయన కుండ బద్దలు కొట్టారు. ఇది దేశవ్యాప్తంగా జరగాల్సిన అవసరం ఉంది. సృజనాత్మకత సైన్స్ అభివృద్ధి సాధించాలంటే సాంప్రదాయక వ్యవస్థ నుండి ఆధునికత పెంపొందించడానికి వ్యవస్థలో ముఖ్యంగా బోధన విధానం లో మార్పులు రావాల్సిన అవసరం ఉంది. గతంలో ఉన్న బోధన వ్యవస్థ కారణంగానే ప్రస్తుత వ్యవస్థ కొనసాగుతుంది అయితే ఇటీవల కొత్తగా రూపొందించిన పాఠ్యప్రణాళిక మూస పద్ధతి, బట్టి పద్ధతికి ఇంకా విద్యా వ్యవస్థలు పనిచేయడం ఆధునిక సైన్స్ విజ్ఞాన శాస్త్రం అభివృద్ధి చెందకపోవడం ఇందుకు అద్దం పడుతుంది. మార్పును కోరుకోవడం ప్రస్తుత తరుణంలో అవసరమే ఇది కేవలం సైన్స్ ద్వారానే అభివృద్ధి సాధిస్తుందని చెప్పవచ్చు, సాంప్రదాయక విధానంలో కూడా సైన్స్ దాగి ఉంటుందని కొంతవరకు చెప్పినప్పటికీ అత్యంత ఆధునికమైన రిమోట్ కంట్రోల్ వ్యవస్థ అభివృద్ధికి సైన్స్ ఎంతగానో బోధపడిందని చెప్పాలి! పూర్వ ప్రాచీన వ్యవస్థలో సైన్స్ లేక కాదు సైన్సును ప్రాచుర్యంలోనికి తీసుకురాకుండా కొంతమంది వ్యక్తులు చేపట్టిన దుష్ప్రచారం వాళ్ళని సైన్స్ అంతగా ప్రాచుర్యం పొందక సమాజంలో మానవ మెదడులో పాతుకుపోయే విధంగా ఈనాటికి కొనసాగుతుందంటే దాని ప్రభావం ఏ మేరకు సమాజం పై పని చేసింది అర్థం చేసుకోవచ్చు. 

ప్రపంచవ్యాప్తంగా ఆధునిక జీవన విభదానంలో ఇంకా కులం కట్టుబాట్లు, మత విశ్వాసాలు ప్రోత్సహించే ఒక వర్గం బోధనలకు అధిక ప్రాధాన్య తీయడం వల్లనే ఈ ప్రపంచంలో సైన్స్ అంతగా ప్రచారంలోనికి రాలేకపోతుంది. దీనికి కారణం సాంప్రదాయక వాదులు పాలకులుగా ఉండటమే కారణం. జీవన చరిత్రలో సైన్స్ విశ్వాసం మధ్య ఘర్షణ నెలకొన్నప్పుడు కొంతమంది సైన్సును బలపరచకపోవడం మనం గమనించదగ్గ విషయం. వ్యక్తులు లేదా అందాలకు చెందిన సైన్స్ కేంద్రక భావజాల వైఖరిని ఎన్నడు బలపరచలేదు. వారు తమదైన శైలిలో బావ వ్యక్తీకరణ బలపరచకపోవడం వారు తమదైన స్వయంగా అభివృద్ధి చేసుకున్న సైన్స్ ను కలిగి ఉన్నారా? లేదు వారు ఇప్పుడు పూర్తిగా ప్రాచ్యాతి సైన్స్ కలిగి ఉన్నారా లేదా చైనా సైన్స్ పై ఆధారపడి ఉన్నారు. ప్రస్తుత ధోరణి ఇలాగే కొనసాగితే భారత్ కూడా అదే ఉచ్చులో పడి సైన్స్ ఉనికి లేని పూర్తి విశ్వాసంతో కూడిన సమాజంగా కొనసాగే అవకాశం ఉంది. విశ్వాసమే జాతీయ పదమని, శాస్త్రీయ చింతన జాతీయ వ్యతిరేకమని ధోరణి దేశంలో పెరుగుతుంది. అదే సమయంలో సమీప భవిష్యత్తులో చైనాలో దేశాలను సవాలు చేయగలిగే స్థాయికి భారత్ అభివృద్ధి చెందుతుందని కూడా వీరు చెప్తున్నారు.

శాస్త్రీయ విజ్ఞానం పక్కనపెట్టి లేదా పిల్లల్లో పెద్దల్లో ప్రశ్నించే తత్వాన్ని చంపేయడం ద్వారా ప్రాచీనతే భారత నాగరికత అని అదే జాతి భవిష్యత్తు అని ప్రచారం చేయడం, కృతనిచ్చేయంతో ముందుకు పోవడం సమాజంలో కొనసాగుతున్న విధానం. శాస్త్రీయమైన ప్రతిదాన్ని దైవదూషణగా భావించే మధ్య ప్రాత్య చింతనతో మానసిక గా పోటీ పడుతున్నట్లు అనిపిస్తుంది.! మానవ జీవితంలో శాస్త్ర ప్రక్రియతో ప్రారంభమైందని, శాస్త్రీయ దృక్పథంతో పెంచడంతోనే సైన్స్ అభివృద్ధి చెందుతుందని ఉదాహరణకు ఒక శిశువు పుట్టినప్పుడు లేక ఇతర ఆహార పదార్థాలను అందించడం శాస్త్రీయ ప్రక్రియ పాలు ఇచ్చే పట్టే దశ నుంచి ఆహారం తీసుకునే దశ వరకు శిశువు జీవితములోనికి విశ్వాసం ప్రవేశించలేదు. తల్లిదండ్రుల విశ్వాసానికి సంబంధించిన పూజ లేదా ప్రార్థన వంటి విశ్వాసాల ద్వారా లేక విద్య బోధనలో నిర్దిష్ట శిక్షణ ప్రక్రియ ద్వారా పిల్లల మనసులో విశ్వాస భావన ప్రారంభమవుతుంది. గురుకులాలు, మదరసాలు చారిత్రకంగా చేసింది ఇదే. సైన్సును బోధించడం అనే భావన వీటిలో కనిపించదు. కానీ ఆధునిక పాఠశాల విభిన్నమైంది. ఆధునిక పాఠశాల వ్యవస్థ ప్రధానంగా సైన్స్ బోధనలకు సంబంధించింది. అలాగే కొంత మేరకు విశ్వాసాలకు సంబంధించి కూడా దీంట్లో భాగమై ఉంటుంది.!

 పాఠశాల బోధనలో విశ్వాసమే ముఖ్యంగా మారిపోతే మానవ మనసు శాస్త్రీయ ప్రయోగశాలలో పనిచేయలేదు. ఎందుకంటే విశ్వాసం ప్రయోగాన్ని ఆమోదించదు. విశ్వాసం వైపే పూర్తిగా ముగ్గు చూపిన రాజకీయ ధోరణి ప్రయోగాన్ని అంగీకరించదు. విశ్వాసం కలిగిన మనసులు భారత్ ను పాలిస్తే దీర్ఘకాలంతోపాటు జాతీయ పదానికి విశ్వాసమే కేంద్ర బిందువుగా ఉంటే, జాతి ప్రస్తుత దిశ నుంచి మధ్య యుగాల దిశకు వెనక్కి వెళ్ళిపోతుంది. భారతీయ వ్యతిరేకమని జాతి వ్యతిరేకమని పేర్కొంటూ శాస్త్రీయంగా ఆలోచించడం నుంచి భారతీయ మనసులను అడ్డుకునేలా చట్టాలను రూపొందించగలరు. ప్రతి దినం ఆలోచించే మనసుపై ఆదిమ మానవుడు ఆనాటి ఆకాంక్షలను విధించడం పరిపాటిగా మారింది. ఓటర్ తో సహా ప్రతి సగటు మనిషి దేశ పౌరుడే. అయినందుకల్లా విశ్వాసం మాత్రమే జీవిత విధానం కనిపిస్తుంది. ప్రపంచం ప్రాచాత్య విధానములో రష్యా లేదా మధ్యప్రచ్యం నుంచి ఆయిల్ పైప్ లైన్ వంటి సప్లై చైన్ వ్యవస్థ ఉన్నంతవరకు ప్రాచాత్య మానవుల స్థిరమైన శాస్త్రీయ చింతన నుంచి ఆవిర్భవించిన సైన్స్, ఇంజనీరింగ్, మెడిసిన్, లేదా టెక్నాలజీ మనం ఉపయోగించవచ్చు. శాస్త్రీయ చింతనతో కూడిన ఈ సప్లై చేయను అందుబాటులో లేకుండా పోయినట్లయితే మనం కాలినడకను మొదలు పెడతాం. ఇది మన గొప్ప నాగరికత విలువకు అద్దం పడుతుంది. కొంతమంది శాస్త్రీయ ఆలోచనలకు విరుద్ధంగా వ్యవహరించడం జరుగుతుంది ముఖ్యంగా ప్రస్తుతం కొనసాగుతున్న మూస పద్ధతి పోతన విధానం ఆశాస్త్రీయ ఆలోచనలకు వెళ్లే ప్రమాదం లేకపోలేదు. 

కార్పొరేట్ విద్యా విధానం “టాంగ గుర్రానికి ”కళ్లకు గంతలు కట్టినట్టు విద్యార్థులకు కేవలం పుస్తకాల పురుగు మాత్రమే పరిచయం అవుతుంది.24 గంటలు మూస పద్ధతి బోధన, అభ్యసన వల్ల సమాజాన్ని, ప్రకృతి వ్యవహారాన్ని, సామాజిక వ్యవస్థను విద్యార్థులు చదవలేక పోతున్నారు . మూస శిక్షణ ద్వారా ఇంజనీరు లేదా డాక్టర్ కావచ్చు ల్యాబ్ లో సైంటిస్ట్ కావచ్చు కూడా. కానీ ఆ ఇంట్లో ఆ ఫ్యాక్టరీలో ఆ ఆసుపత్రిలో లేదా ఆ ల్యాబ్ లో అసలు సిసలు ఆవిష్కరణలు గానీ విమర్శతో కూడిన సృజనాత్మకత మనసు గాని అభివృద్ధి చెందే అవకాశం లేదు.! భూమిని దున్నే రైతుకు కాకుండా సన్యాసికి మాత్రమే ప్రశంసలు దక్కుతున్నప్పుడు, సైన్స్ లేదా గణిత శాస్త్ర ఉపాధ్యాయుడికి కాకుండా ప్రశంసలు ఎవరికి అందుతున్నాయో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. ప్రపంచానికి విశ్వాస మార్గాన్ని చూపాలని ప్రపంచమంతట సమృద్ధిగా దాన్ని పంపిణీ చేయాలని కోరుకుంటున్నారు. ఏది ఏమైనా అప్పటికి విద్యార్థికి శాస్త్రీయ విద్యా బోధన, కేవలం నాలుగు గోడల మధ్య మూస పద్ధతి బోధన విధానాన్ని వీడనాడకపోతే ప్రపంచ వ్యవస్థను విద్యార్థికి నేర్పడం కష్టమవుతుంది. దీనిపై మేధావి వర్గం తీవ్రంగా చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రాచీన సాంప్రదాయాలలో జీవన విధానంలో సైన్స్ కూడా ఉంది కానీ నాటి ఆలోచనలు నేడు అమ్ములు పరచకుండా ఆధునిక ఆశాస్త్రీయ విధానం ప్రపంచ పై రుద్దడానికి చేస్తున్న కార్పొరేట్ కుట్ర అని చెప్పవచ్చు. అంతరిక్షానికి రాకెట్ ప్రయోగిస్తున్నప్పటికీ విశ్వాసం పైన నమ్మకం ఉంచి రాకెట్ ప్రయోగించడం మన శాస్త్రీయత లోపాయిష్టత బయటపడుతుంది. శాస్త్రీయంగా ఆలోచించే వ్యక్తులకు సమాజంలో కట్టుబట్ల పేరుతో ఆంక్షలు విధించి నిర్బంధించడం జరుగుతుంది. దీనివల్ల విశ్వాసానికి యోగ్యత పెరిగి, శాస్త్రీయ విజ్ఞానానికి అయోగ్యత అవుతుంది.

డాక్టర్ .రక్కిరెడ్డి ఆదిరెడ్డి
పౌర సంబంధాల అధికారి కాకతీయ విశ్వవిద్యాలయం,

ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల