అంబేద్కర్ పుట్టిన రోజున సెక్రటేరియట్ ఓపెన్ చేయాలి: స్టేట్ చీఫ్ బండి సంజయ్ కుమార్

అంబేద్కర్ పుట్టిన రోజున సెక్రటేరియట్ ఓపెన్ చేయాలి: స్టేట్ చీఫ్ బండి సంజయ్ కుమార్
Bandi Sanjay on new Secretariat
  • కేసీఆర్ పుట్టిన రోజున ఎలా చేస్తారు
  • టిఆర్ ఎస్ పాలనలో రాష్టం దివాళా తీసింది
  • తొమ్మిదేళ్లలో రూ.5 లక్షల కోట్లు అప్పు చేసిండు
  • రాష్టంలో చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాకే జాతీయ పార్టీ గురించి చెప్పాలి
  • అవినీతి, అక్రమాలు తప్ప చేసిన అభివృద్ధి శూన్యమే
  • బీజేపీ స్టేట్ ఎగ్స్ క్యూటివ్ మీటింగ్ లో స్టేట్ చీఫ్ బండి సంజయ్ కుమార్

మహబూబ్ నగర్ ప్రతినిధి, ముద్ర : నీళ్లు,నిధులు,నియమకాలని ఉద్య మ సమయంలో వేధికలెక్కి ఉత్తర ప్రగల్బాలు పలికిన సీఎం కేసీఆర్, రాష్టం ఏర్పడ్డాక అధికారంలోకి వచ్చి న తర్వాత ఉద్యమ స్ఫూర్తికి మంగళం పాడి, అవినీతి, అక్రమా లకు పెద్ద పీట వేయడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ కుమార్ అన్నారు. కేవలం తొమ్మిదేళ్ల పాలనలో రూ.5 లక్షల కోట్లు మేరకు అప్పులు చేశాడని ఆరోపించారు. రాష్టం ఏర్పడ్డ తొలినాళ్లలో మిగులు బడ్జెట్ ఉందని,కేసీఆర్ పుణ్యమా అని నేడు రాష్ట్ర ఖాజాన దివాళా తీసిందని తెలిపారు. ఉద్యోగ నియామకాల పేరుతో నోటిఫికేషన్లు ఇచ్చి ప్రక్రి య  పూర్తి చేయడంలో చిత్తశుద్ధి చాటడం లేదని అన్నారు. ఇందులో భాగంగానే ఇటీవల ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్లకు సంబంధించి జారీ చేసిన GO317 జీఓ 317 పై ప్రభుత్వ వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. న్యాయమైన కోర్కెల సాధ న కోసం ప్రగతి భవన్ ముట్టడించిన మహిళ ఉపాధ్యాయులను పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పిన ఘనత కేవలం కేసీఆర్ కే దక్కుతుందని అన్నా రు.

Also Read: నిజాలను నిర్భయంగా చెప్పే 'ముద్ర' వేయాలి: మంత్రి చామకూర మల్లారెడ్డి

రాష్ట్ర ఖజానాకు తూట్లు పొడిచిన సీఎం కేసీఆర్, తాజాగా జాతీయ రాజకీయాలు మాట్లాడడం  విడ్డురంగా ఉందని అన్నారు. రాష్టం లో చేప్పట్టిన అభివృద్ధి కేవలం కాగి తాలకు అంకితమైందని ఎద్దేవా చేశా రు.కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడు తూ తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి ని రాజకీయం చేస్తున్నదని తెలిపా రు.కేంద్రం తెలంగాణ అభివృద్ధికి భారీ మొత్తంలో నిధులు మంజూరు చేసిన, సెంట్రల్ రాష్టానికి సహకరిం చడం లేదని చెప్పడం సరికాదని అన్నారు.తెలంగాణ రాష్టంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి జోష్యం చెప్పారు. కాంగ్రెస్ గురించి పట్టించు కోవద్దని, అధికారమే లక్షంగా కార్య కర్తలు, పదాధికారులు పని చేయాల ని పిలుపునిచ్చారు. రాష్టంలో జరుగుతున్నది అరాచక పాలన అని మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి అన్నారు.ప్రజాస్వామిక పాలన కేవలం బీజేపీ కే సాధ్యమని తెలిపారు.కేసీఆర్ అవినీతి పాలనపై  కేంద్రం త్వరలోనే చర్యలు తీసుకుంటు న్నదని ఎమ్మెల్యేలు రఘునందన్ రావు,ఈటెల రాజేందర్ తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. 

ఉద్యమ స్ఫూర్తిగా...

రాష్టంలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందుకు తీసుకుపోవడం లో ప్రజా సంగ్రామ యాత్ర తరహాలోనే ఉద్యమ స్ఫూర్తిని రగిలించాలని బీజేపీ స్టేట్ ఎగ్స్ క్యూటివ్ సమావేశం తీర్మానించింది. ఇందులో భాగంగానే ప్రజా సమస్య ల పరిష్కరనికి అలుపులేని పోరా టాన్ని కొనసాగించాలని నిర్ణయించా రు.సీఎం కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాలను రాష్ట్రములోని ప్రతి ఇంటికి చేరవేయలని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ కుమార్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. లక్షల కోట్లు అప్పులు చేసిన కేసీఆర్ , తన కుటుంబ సభ్యులతో ఏకపక్ష పాలన సాగిస్తున్నారని తెలిపారు.దీనిపై ప్రజా పోరాటం నిర్మిద్దామని పిలిపునిచ్చారు.

అంబేద్కర్ పుట్టిన రోజు..
రాష్ట్ర సచివాలయం భారత రత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టిన రోజున కాకుండ, సీఎం కేసీఆర్ పుట్టిన రోజు ప్రారంభించడం  ఏమిటని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు.సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టిన మీరు,సచివాలయ ప్రాంగణంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. ఇది కాక దళితులకు ఇస్తానన్న మూడెకరాల వ్యవసాయ భూమి, దళితుడికే ముఖ్యమంత్రి పదవి,దళిత బంధు వంటి పథకాలపై సీఎం కేసీఆర్ స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.దీనితో పాటు నిరుద్యోగ భృతి , రూ.లక్ష రుణమాఫీ వంటి కార్యక్రమాలు కేసీఆర్ ధ్వంద నీతికి నిదర్శనమని అన్నారు.

ఎమ్మార్పీఎస్ నిరసన 

మాదిగ ల ఏబీసీడీ వర్గీకరణపై బీజేపీ స్పష్టత ఇవ్వడం లేదని, దీనిపై తక్షణమే ప్రకటన చేయడం తోపాటు వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రంలో మంగళవారం జరిగిన బీజేపీ స్టేట్ ఎగ్స్ క్యూటివ్ సమావేశం వద్ద ఎమ్మార్పీఎస్ నాయకులు నిరసన గళం వినిపిం చారు.ఇందులో భాగంగానే సమావే శాలను అడ్డుకునే ప్రయత్నం చేయ గా , పోలీసు అడ్డుకున్నారు. ఆందోళ నకారులను అదుపులోకి తీసుకు న్నారు.