కాంగ్రెస్ పార్టీ టికెట్లను  అమ్ముకున్న వ్యక్తి రేవంత్

కాంగ్రెస్ పార్టీ టికెట్లను  అమ్ముకున్న వ్యక్తి రేవంత్
  • ఓటుకు నోటుకు దొంగ రేవంత్ రెడ్డి
  • కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కడెంపల్లి శ్రీనివాస్ గౌడ్

ముద్ర, షాద్‌నగర్:-ఓటుకు నోటు దొంగ రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేయలేక కాంగ్రెస్ పార్టీని వీడుతున్నామని షాద్ నగర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ సర్పంచ్ కడెంపల్లి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. టికెట్ రావాలంటే అదృష్టం కావాలి.. వీర్లపల్లి శంకర్ కు టికెట్ వచ్చినందుకు నేను బాధపడడం లేదు సోనియా గాంధీని, రాహుల్ గాంధీని విమర్శించడం లేదనీ అయన అన్నారు.

 ఆదివారం ఆయన తన నివాస గృహంలో అనుచరులతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. తన వర్గం మొత్తం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించాడు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. గతంలో 32 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ పార్టీకి చేసిన సేవలను ఆయన గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి ప్రవర్తిస్తున్న తీరు నచ్చక కాంగ్రెస్ పార్టీ నుండి బయటికి వెళుతున్నాము తప్ప కాంగ్రెస్ పార్టీ గాని అధిష్టానం పై గాని తమకు ఎలాంటి దురుద్దేశం లేదని ఆయనతోపాటు పలువురు సీనియర్ నాయకులు కార్యకర్తలు తమ తమ బాధను వ్యక్తపరిచారు. తాను గత కొన్నేళ్లుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ పార్టీ పటిష్టతకు కష్టపడినట్లు వివరించారు.కాంగ్రెస్ ను బ్రస్టు పట్టించేందుకు వచ్చిన రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి పార్టీలో కష్టపడే వాళ్ళకంటే డబ్బులు ఉన్నవాళ్లకు ఎక్కువగా ప్రాధాన్యత ఉన్నట్లు ఆయన ఆరోపించారు.ఐనప్పటికీ పార్టీ కోసం కష్టపడుతూ షాద్నగర్ అసెంబ్లీ టికెట్ కోసం ప్రయత్నిస్తే అక్కడ కూడా రేవంత్ రెడ్డి తమకు అన్యాయం చేసినట్లు ఆయన మండిపడ్డారు. గతంలో తాను కొత్తూరులో సర్పంచ్ గా గెలిచి గ్రామాన్ని మంచి గుర్తింపు వచ్చేలా అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. బిఆర్ఎస్ పార్టీ సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టి నిరుపేదల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నందున బిఆర్ఎస్ పార్టీలో ఉండి ప్రజలకు సేవలు అందించడం లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతామని ఆయన వివరించారు. కాంగ్రెస్ పార్టీపై తమకు ఎలాంటి కోపం లేనప్పటికీ రేవంత్ రెడ్డి నియంత పాలనను నిరసిస్తూ తనతో పాటు కొత్తూరు మున్సిపాలిటీకి చెందిన నలుగురు కౌన్సిలర్లతోపాటు తన అనుచరులను తీసుకొని తాను కేటీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు. రేపటినుండి తాము బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అంజయ్య యాదవ్ ను భారీ మెజార్టీతో గెలిపించేందుకు తాము కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు. 

ఈ కార్యక్రమంలో కొత్తూరు మున్సిపాలిటీ కౌన్సిలర్లు మాదారం నరసింహులు గౌడ్ సోమ్లా నాయక్ ,అనిత శ్రీనివాస్ గౌడ్, మాధవి గోపాల్ గౌడ్, మాజీ ఎంపీటీసీ మాదారం కృష్ణ గౌడ్  మెహ్రాజ్, నాయకులు యాదయ్య, రాజు ,వీరమొని వెంకటేష్ ,వీరమొని శ్రీను,జనార్దన్ రెడ్డి, గోపాల్ గౌడ్, సద్దాం యాసీన్ ,వంశీ, శ్రీశైలం, కిరణ్ రెడ్డి ,వంశీ గౌడ్, విష్ణు,తదితరులు పాల్గొన్నారు.