Bachula Arjuna Death News టీడీపీ సీనియర్​ నేత బచ్చుల అర్జునుడు కన్నుమూత 

Bachula Arjuna Death News టీడీపీ సీనియర్​ నేత బచ్చుల అర్జునుడు కన్నుమూత 
Bachula Arjuna Death News

 తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు (65) కన్నుమూశారు. జనవరి 28న గుండెపోటుతో విజయవాడలోని రమేశ్‌ ఆసుపత్రిలో చేరిన ఆయన నెల రోజులుగా మృత్యువుతో పోరాడి గురువారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు.  

కృష్ణా జిల్లా మచిలీపట్నంకు చెందిన బచ్చుల అర్జునుడు తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. 1995 నుంచి 2000 సంవత్సరం వరకు పీఏసీఎస్‌ అధ్యక్షుడిగా, 2000 నుంచి 2005 వరకు మచిలీపట్నం మున్సిపల్‌ ఛైర్మన్‌గా పనిచేశారు. 2014లో కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. 2017లో ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలికి జరిగిన ఎన్నికల్లో శాసనసభ్యుల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.