సీనియర్ జర్నలిస్ట్ ఉపేంద్ర బాబు మృతి..

సీనియర్ జర్నలిస్ట్ ఉపేంద్ర బాబు మృతి..

ముద్ర,ఆంధ్రప్రదేశ్:- సీనియర్‌ జర్నలిస్టు, ఆంధ్రజ్యోతి డిప్యూటీ ఎడిటర్‌గా పనిచేసిన గారపాటి ఉపేంద్రబాబు గురువారం రాత్రి మృతి చెందారు. ఆయన అంత్యక్రియలు ఈరోజున విజయవాడలో నిర్వహించనున్నారు. ఆయన మృతి పట్ల నేషనల్‌ అలయన్స్‌ ఆఫ్‌ జర్నలిస్ట్‌, ఆంధ్ర ప్రదేశ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్‌ ఫెడరేషన్‌, ఆంధ్రప్రదేశ్‌ బ్రాడ్‌ కాస్ట్‌ జర్నలిస్ట్‌ అసోసియేషన్లు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశాయి. 1935లో జన్మించిన ఉపేంద్ర బాబు సుదీర్ఘ కాలం ఆంధ్రజ్యోతిలో వివిధ హోదాలలో పనిచేశారు.

డిప్యూటీ ఎడిటర్‌ హోదాలో పదవీ విరమణ చేశారు. రాష్ట్రంలో జర్నలిస్టు ఉద్యమాల్లో ఉపేంద్ర బాబు కీలక భూమిక పోషించారు. ఆయన యూనియన్‌ కార్యకలాపాలలో చురుకైన నాయకుడిగా పనిచేశారు. యూనియన్‌ అధ్యక్షుడిగా రెండు దఫాలు పనిచేశారు. స్నేహశీలి, జర్నలిస్టుల శ్రేయోభిలాషిగా వివిధ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవారు. యువ జర్నలిస్టులను అనుక్షణం ప్రోత్సహించడంలో ఉపేంద్ర బాబు ముందుండేవారు. ఎన్‌ఏజే, ఏపీడబ్ల్యూజేఎఫ్‌, ఏపీ బీజేఏలు ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని వ్యక్తం చేశాయి. ఎపిడబ్ల్యుజెఎఫ్‌ నేతలు ఎన్‌.కొండయ్య సెక్రటరీ జనరల్‌, అమరయ్య కోశాధికారి ఎన్‌ఏజే, ఎస్‌ వెంకట్రావు అధ్యక్షులు, జి.ఆంజనేయులు ప్రధాన కార్యదర్శి, వి.శ్రీనివాసరావు కే మునిరాజు, కన్వీనర్లు ఏపీ బీజేఏ లు ఉపేంద్రబాబు మృతిపట్ల సంతాపం తెలిపారు.