ఖాజాగూడ లో పర్యటించిన శేరిలింగంపలి MLA గాంధీ

ఖాజాగూడ లో పర్యటించిన శేరిలింగంపలి MLA గాంధీ

 గారు. ఈ సందర్భంగా వారు నీహారిక, అపర్ణ, జైన్స్ కార్లటన్, చిత్రపురి కాలనీ,  అపారట్మెంట్ మరియు సాయి ఐశ్వర్య, వైభవ్ లేఔట్   ల కాలని వాసులు వారి వారి ప్రతినిధులతో కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకునారు. తర్వాత జైన్స్ కార్లటన్ అపారట్మెంట్ లాన్లో పైవారి అందరితో భారీ సభ జరిగింది.  దీనిలో ఆయా అసోసియేషన్ అధ్యక్షులు/సభ్యులైన మల్లికార్జున్ , జయంత్ రావు, డా: చంద్రశేఖర్, సురేందర్, వల్లభనేని అనిల్ మరియు ఆయా నివాసితులందరూ పెద్ద సంఖ్య లో పాల్గొన్నారు. 


వర్షం పడినపుడు అపారటమెంట్ గేట్ ముందు నీళ్లు బాగా నిలబడటం, తరచుగా కరెంట్ కట్ కావటం, రాయదుర్గం చౌరస్తా లో చాలాసేపు ట్రాఫిక్ జామ్, రోడ్ దాటటానికి ఫుట్ ఒవర్ వంతెన తదితర విషయాలు ప్రస్తావంచగా, వాటికి గురించి, MLA గారు వెంటనే విద్యుత్ DE తో  మాట్లాడి జనవరిలో పరిష్కరించబడుతుందని చెప్పారు. రాయదుర్గం చౌరస్తా లో అండర్ పాస్ రాబోతున్నదని, మిగిలిన సమస్యలకు తగిన పరిష్కారం త్వరలో జరగనుందని తెలిపారు.