సెర్ఫ్ ఉద్యోగులకు పే స్కేలు..

సెర్ఫ్ ఉద్యోగులకు పే స్కేలు..
  • జీవో నెంబర్ 11 విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం..
  • నెరవేరిన 23 సంవత్సరాల సెర్ప్ ఉద్యోగుల కళ

23 సంవత్సరాలుగా చాలీచాలని నేతనాలతో నామ మాత్రపు ఉద్యోగ భద్రతతో పనిచేస్తున్న సర్ప్ ఉద్యోగులకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఉగాది కానుకగా తీపి కబురు చెప్పారు.

గత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు గత సంవత్సరం అసెంబ్లీలో మార్చి 15 న ప్రకటించిన ప్రకారం సరిపోద్యోగులకు పే స్కేల్ వర్తింపజేస్తూ జీవో నెంబర్ 11 ను ఈరోజు విడుదల చేశారు.

ఈ సందర్భంగా SERP ఉద్యోగ సంఘాల స్టేట్ జేఏసీ నాయకులు కుంట గంగాధర్ రెడ్డి నరసయ్య సుదర్శన్ సుభాష్ జానయ్య వెంకట్ సురేఖలు ఒక ప్రకటన ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి కి, రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు.

ఏప్రిల్ ఒకటి నుంచి ఈ జీవో అమల్లోకి వస్తుందని తెలియజేస్తూ పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా జీవో జారీ చేశారు. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ లో స్టేట్ జేఏసీ తరఫున ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో సెర్ప్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కుంట గంగాధర్ రెడ్డి స్థానిక సిబ్బంది పాల్గొన్నారు.