దేవాలయాల అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తాం

దేవాలయాల అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తాం
  • షాబాద్ జడ్పిటిసి పట్నం అవినాష్ రెడ్డి.
  • సాయిరెడ్డిగూడ మల్లన్న దేవాలయం నిర్మాణానికి రూ. 3లక్షలు అందజేసిన జడ్పీటీసీ

ముద్ర: షాబాద్:- దేవాలయాల అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని షాబాద్ జడ్పిటిసి పట్నం అవినాష్ రెడ్డి అన్నారు. గురువారం షాబాద్ మండల పరిధిలోని సాయిరెడ్డి గూడ మల్లన్న దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నూతనంగా నిర్మిస్తున్న దేవాలయానికి తన వంతు సహాయంగా మూడు లక్షల రూపాయలు అందజేశారు.

అనంతరం గ్రామస్తులు శాలువాతో జడ్పిటిసిని ఘనంగా సత్కరించారు.  ఈ సందర్భంగా అవినాష్ రెడ్డి మాట్లాడుతూ...ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలని సూచించారు. పురాతన దేవాలయాల అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరు భక్తి భావాన్ని పెంపొందించుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు పోన్న నరసింహ రెడ్డి, గ్రామ మాజీ సర్పంచ్ సులోచన శేఖర్ రెడ్డి, నాయకులు సుధాకర్ రెడ్డి, గోపాల్  తదితరులున్నారు.