దేశానికి సాంకేతిక రంగాన్ని తీసుకువచ్చిన ఘనత రాజీవ్ గాంధీదే 

దేశానికి సాంకేతిక రంగాన్ని తీసుకువచ్చిన ఘనత రాజీవ్ గాంధీదే 
  • షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

ముద్ర/షాద్ నగర్:- దేశానికి సాంకేతిక రంగాన్ని తీసుకువచ్చిన ఘనత స్వర్గీయ రాజీవ్‌ గాంధీదే నని షాద్ నగర్ ఎమ్మెల్యే "వీర్లపల్లి శంకర్" అన్నారు. మంగళవారం షాద్ నగర్ పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాల ముందు ఉన్న మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కే. చెన్నయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున చేరుకొని వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే "వీర్లపల్లి శంకర్"  మాట్లాడుతూ దేశం శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందంటే కేవలం రాజీవ్ గాంధీ పుణ్యమేనా అని గుర్తు చేశారు. దేశానికి ఇంటర్నెట్ సౌకర్యం తీసుకువచ్చి ఎంతో అభివృద్ధి సాధించారని తెలిపారు. రాజీవ్ గాంధీ ఆశయ సాధన కోసం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.

నేడు భారతదేశ శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఈ స్థాయిలో పురోగమిస్తుంది అంటే దానికి రాజీవ్ గాంధీ సేవలే నిదర్శనం అని అన్నారు. రాజకీయాల్లో ఎంతో విలువలు పాటించేవారని ఆయన ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పాయ్ కు ఎంతో గౌరవం ఇచ్చేవారని, దేశ అభివృద్ధిలో ప్రతిపక్షాల పాత్ర ఉండాలన్న దృక్పథంతో ఆయన సేవలు పొందే వారిని ఈ సందర్భంగా గుర్తు చేశారు. వాజ్ పాయ్ ఆరోగ్యం కోసం విదేశాల్లో చికిత్స అందించిన ఘనత రాజీవ్ గాంధీకి దక్కుతుందని అన్నారు. రాజకీయాల్లో ఎంతో నేర్పరిగా ఉన్నారని, రాజీవ్ గాంధీ ఆశయాలను ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కొనసాగించాలని సూచించారు. రాజీవ్ గాంధీ ఆశయాల అడుగుజాడలలో తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారద్యంలో సోనియాగాంధీ రాహుల్ గాంధీల ఆశీస్సులతో ప్రజాపాలన అందిస్తున్నామని ఎమ్మెల్యే శంకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పిసిసి సభ్యులు మహమ్మద్ అలీ ఖాన్ బాబర్, ఎంపీపీ ఖాజా అహ్మద్ ఇద్రీస్, జెడ్పిటిసి వెంకటరామిరెడ్డి, మండల అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, మైనార్టీ నేత జమ్రుద్ ఖాన్, కాంగ్రెస్ యువ నాయకులు పురుషోత్తం రెడ్డి, కౌన్సిలర్ కృష్ణవేణి, అందె శ్రీకాంత్, గంగమొనీ సత్తయ్య, కేశంపేట మండలం నాయకులు జగదీష్, వీరేశం, శ్రీధర్ రెడ్డి, సురేష్ రెడ్డి, కొత్తూరు మండల పార్టీ అధ్యక్షుడు హరినాథ్ రెడ్డి, లింగారెడ్డి గూడా అశోక్ తోపాటు ఆసుపత్రి వైద్యులు సిబ్బంది పాల్గొన్నారు.