క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తాం ...షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తాం ...షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
  • మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం 
  • 100కు పైగా టీంలతో క్రికెట్ పోటీలను ప్రారంభించిన "ఎమ్మెల్యే శంకర్" 

ముద్ర, షాద్ నగర్: రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. బుధవారం షాద్నగర్ లో మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ 2024 ను స్థానిక ఎమ్మెల్యే "వీర్లపల్లి శంకర్" లాంచనంగా ప్రారంభించారు.  స్టేడియంలో మొదట బ్యాటింగ్ చేసి టోర్నమెంటును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన క్రీడాకారుల సమావేశంలో ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ వేసవి సెలవుల సందర్భంగా విద్యార్థులకు, యువకులకు ఉపయోగపడే క్రీడలను ఏర్పాటు చేయడం పట్ల నిర్వాహకులను అభినందించారు.

ప్రభుత్వం క్రీడలకు ఎక్కువ ప్రాధాన్యత కల్పిస్తుందని ఎమ్మెల్యే శంకర్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం అంతర్జాతీయ క్రీడా పోటీలకు వేదిక కానుందని సూచనప్రాయంగా తెలిపారు. 2036లో అంతర్జాతీయ క్రీడా పోటీలు జరగబోతున్నాయని దీనికి సంబంధించి హైదరాబాద్ లో ఇప్పటినుండే పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయని ఎమ్మెల్యే శంకర్ అన్నారు. అదేవిధంగా ప్రభుత్వ సహకారంతో ఎన్నో నియోజకవర్గాల్లో ఇండోర్, ఇతర సదుపాయాలతో నూతన స్టేడియాలు సైతం అత్యాధునికంగా నిర్మించబోతున్నామని తెలిపారు. ఇందులో భాగంగానే షాద్ నగర్ నియోజకవర్గం కేంద్రంలో ఉన్న ఇండోర్ స్టేడియం అత్యాదునికంగా నిర్మించేందుకు సుమారు రెండున్నర కోట్ల వరకు ఖర్చు చేసే అవకాశాలు ఉన్నాయని ఈ పనులకు సంబంధించి స్పోర్ట్స్ అథారిటీ వారు అధికారులు పరిశీలన జరుపుతున్నారని వీటికి సంబంధించిన ప్రణాళిక చర్యలు సిద్ధం చేస్తున్నారని తెలిపారు. అదే విధంగా నియోజకవర్గంలోని కొందూర్గు మండలంలో కూడా స్టేడియం నిర్మాణానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే ప్రకటించారు.

క్రీడలకు సంబంధించి ఏవైనా లోటుపాట్లు ఉంటే తన దృష్టికి తేవాలని సాధ్యమైనంత మేర తాను వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. క్రీడాకారులు తమ నైపుణ్యతను చాటుకునే విధంగా క్రీడలపై దృష్టి పెట్టాలని ఎమ్మెల్యే తెలిపారు. హైదరాబాద్ కు అత్యంత సమీపంలో ఉన్న ఈ నియోజకవర్గంలో క్రీడలకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకుని ఇక్కడ అత్యాధునిక పరిజ్ఞానంతో అన్ని వనరులు కల్పించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  వ్యక్తిగత కార్యదర్శి స్పోర్ట్స్ అథారిటీకి సంబంధించి ఇక్కడ క్రీడాభివృద్ధి కోసం పాటుపడుతున్నారని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

ఈ టోర్నమెంట్ కు సంబంధించి మొదటి బహుమతి 50 వేల రూపాయలను కాంగ్రెస్ నాయకుడు గోపాల్ రెడ్డి ప్రకటించారు. అదేవిధంగా రెండవ బహుమతి 25 వేల రూపాయలను అనిల్ రెడ్డి ప్రకటించారు. ఇంకా ఈ క్రికెట్ పోటీలను సమర్పించిన వారిలో హరికుమార్, ఎజాజ్, మహ్మద్ రవూఫ్, మాజీ కౌన్సిలర్ రాజేందర్ రెడ్డి సహకరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పిసిసి సభ్యులు మొహమ్మద్ అలీ ఖాన్, తిరుపతి రెడ్డి, యువ నాయకుడు క్రీడాకారుడు  గోపాల్ రెడ్డి, యువ నాయకులు ముబారక్ , శ్రీను నాయక్, మురళీమోహన్ అప్పి, దిలీప్, రాజు నాయక్, అశోక్ తదితరులు పాల్గొన్నారు..