బీసీలను  అన్నీ రంగాలలో నిలబెట్టాలన్నదే కాంగ్రెస్  లక్ష్యం” 

బీసీలను  అన్నీ రంగాలలో నిలబెట్టాలన్నదే కాంగ్రెస్  లక్ష్యం” 
  • “కులగణన పై మాది తిరుగులేని చిత్తశుద్ది”
  • షాద్ నగర్ శాసన సభ్యులు వీర్ల పల్లి శంకర్ 

షాద్ నగర్ : బీసీలు అన్నీ రంగాలలో నిలబెట్టాలనే సంకల్పంతోనే శాసన సభలో బీసీ కులగణన బిల్లును ప్రవేశపెట్టడం జరిగిందని షాద్ నగర్ శాసన సభ్యులు వీర్ల పల్లి శంకర్ వివరించారు.శనివారం పట్టణంలోని ఎం‌ఎల్‌ఏ  క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్బంగా ఎం‌ఎల్‌ఏ వీర్ల పల్లి శంకర్ మాట్లాడుతూ బీసీలు ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న బీసీ సమగ్ర కులగణనకు తెలంగాణ శాసన సభలో ఏకగ్రీవ తీర్మానం లంభించడం ఎంతో సంతోషించ తగ్గవిషమని వివరించారు. రాష్ట్రం లోని ప్రజలందరి స్తితిగతులు , వారి వివరాలను శాస్త్రీయంగా సేకరించేందుకు ,ఎస్‌సి ,ఎస్‌టి,బి‌సి.వర్గాల సామాజిక ,ఆర్థిక,విద్యా ,ఉపాధి , రాజకీయ అవకాశాల ప్రణాళికలను రూపొందించదనికి కులగణన చేపట్టడం జరుగుతుందని వివరించారు.

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి‌ఆర్ అంబేథ్కర్ బీసీ వర్గాల ప్రజలను అభివృద్ది చేయాలనే దూర దృష్టి తోనే ప్రణాళికలు ఏర్పాటు చేయటం జరిగిందని గుర్తుచేశారు.దేశంలో అత్యదిక జనాభా కలిగిన కులాలు 136 ఉన్నాయని తెలిపారు. ఎస్‌సీ ,ఎస్టీలకుల రిజర్వేషన్లు తీసుకురావడం జరిగిందని అదే తరహాలో బీసీ కులగణన చేపట్టడం జరుగుతుందని విరరించారు.బీసీ కులగణన చేయాలని ఎన్నో న్యాయ పోరాటాలు చేయటంతో పాటు చట్ట సభల్లో తమ వాణి వినిపించడం జరిగిందని గుర్తుచేశారు. తెలంగాణ ముఖ్య మంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి బీసీ కులగణనకు సంపూర్ణ మద్దతు తెలపడం ఎంతో అభినంద నియనం అని అన్నారు. ప్రజాస్వామ్యంలో అన్నివర్గాల ప్రజలకు సమాన అవకాశాలు కల్పించాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. కుటుంబ పాలనకు చరమ గీతం పాడటంతోపాటు వర్గాలకు సమాన అవకాశాలు కల్పించేందుకు కృషిచేస్తామని వివరించారు.శాసన సభలో బీసీ  కులగణన బిల్లుకు ఏకగ్రీవ ఆమోదం లభించడంపై ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డికి ,కాంగ్రెస్ అగ్రనాయకుడు  రాహుల్  గాంధీ కి ప్రత్యేక దాన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నేతలు బాబర్ ఖాన్, చెన్నయ్య , జాకారం శేఖర్ ,నల్లమోని శ్రీదర్ ,సత్యయ్య ,రఘు నాయక్ ,అశోక్ లు పాల్గొన్నారు.