గంజాయి కేసులో షణ్ముఖ్ జస్వంత్ అరెస్ట్...

గంజాయి కేసులో షణ్ముఖ్ జస్వంత్ అరెస్ట్...

ముద్ర,హైదరాబాద్:- ప్రముఖ యూట్యూబర్, బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ జస్వంత్ మరో వివాదంలో చిక్కుకున్నాడు. గంజాయి కేసులో షణ్ముఖ్ తో పాటు అతని అన్నయ్య సంపత్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మౌనిక అనే యువతిని ప్రేమించిన సంపత్ మరొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. దీంతో మౌనిక మోసం చేశాడంటూ పోలీసులను ఆశ్రయించింది.

సంపత్ కోసం పోలీసులు ఇంటికి వెళ్లారు. ఫ్లాట్ లో షణ్ముఖ్ జస్వంత్ గంజాయి సేవిస్తూ కనిపించారు. షాక్ అయిన పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వేర్వేరు కేసుల్లో ఇద్దరినీ అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది.గతంలో షణ్ముఖ్ హిట్ అండ్ రన్ కేసులో అరెస్ట్ అయ్యాడు.