మహిళా రక్షణలో షి టీమ్స్ బృందాలు 

మహిళా రక్షణలో షి టీమ్స్ బృందాలు 
  • అడుగడునా నిఘా కళ్లతో షీ టీం బృందాల పర్యవేక్షణ 
  • ఫిర్యాదుల స్వీకరణకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం 
  • జిల్లా పరిధిలో ఫిబ్రవరి నెలలో మొత్తం 17 ఫిర్యాదులకు పరిష్కారం
  • మహిళలను వేదిస్తే  కఠిన చర్యలు తప్పవు: జిల్లా ఎస్పీ చందనా దీప్తి

ముద్ర ప్రతినిధి, నల్గొండ: నల్లగొండ షీ టీమ్ పోలీస్ బృందాలు జిల్లా వ్యాప్తంగా జన సమూహాలు ఎక్కువగా ఉండే ప్రాంతాలతో పాటు బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, కళాశాలలు, మార్కెట్లు,  షాపింగ్ మాల్స్ ఇలా ప్రతి చోటా డేగ కళ్లతో పర్యవేక్షణ చేస్తూ లైంగిక వేధింపులు, ఈవ్ టీజింగ్ మొదలు ప్రతి అంశంలో మహిళలకు ధైర్యాన్ని కల్పిస్తూ నిరంతరం ముందుకు సాగుతూ ఉన్నాయని జిల్లా ఎస్పీ చందన దీప్తి తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలోని కళాశాలలు, పాఠశాలల్లో సోషల్ మీడియా, ఇవిటిజింగ్ పై షీ టీం బృందం అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నల్లగొండ షీ టీమ్స్ బృందాలు రక్షణ కల్పించే విషయంలోనే కాక మహిళలు నేరుగా పోలీస్ స్టేషన్లకు రావాల్సిన అవసరం లేకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకుంటూ డయల్ 100 ద్వారా, పోలీస్ శాఖ విడుదల చేసిన క్యూ.ఆర్ కోడ్ స్కానింగ్ పద్దతిలో, వాట్సప్ లాంటి సామాజిక మాధ్యమాల ద్వారా పిర్యాదు చేసే అవకాశాన్ని మహిళలకు కల్పించి నిరంతరం షీ టీమ్స్ వారి వెన్నంటి నిలిచేలా ముందుకు సాగుతున్నాయనీ తెలిపారు. నల్లగొండ జిల్లా పరిధిలో పాఠశాలలు, కళాశాలల విద్యార్థినులకు, మహిళా ఉద్యోగులకు, గ్రామాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందనీ తెలిపారు. మహిళలు ఆకతాయిలతో కానీ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ క్రింది ఫోన్ నెంబర్లు కి జిల్లా ఎస్పీ, 8712670200, షీ టీమ్ నల్లగొండ –8712670235 , షీ టిమ్ మిర్యాలగూడ  యస్ ఐ కోటేష్  నెంబర్ 8096004465. మీ యొక్క సమాచారం ఇవ్వాలని వారి వివరాలను గోప్యంగా ఉంచబడుతుందన్నారు.

 సామాజిక మద్యమాల పట్ల జాగ్రత్తా .. 

సామాజిక మద్యమాలైన ఫేస్ బుక్, ఇన్స్త్రాగ్రం లాంటి వాటిలో ప్రెండ్ రిక్వెస్ట్ పెట్టి వాటి ద్వారా పరిచయం పెంచుకోవడం, ఫోటోలు తీసుకొని మోసం చేస్తున్న కేసులు, వాట్సప్ ఫోటోలను స్క్రీన్ షాట్ తీసుకొని వాటిని మార్ఫింగ్ చేసి వాటినే ఆ అమ్మాయికి పంపి బ్లాక్ మెయిల్ చేస్తున్నారని, అందువల్ల మహిళలు, యువతులు, అమ్మాయిలు చాలా జ్రాగ్రత్తగా ఉండాలని, సామాజిక మాధ్యమాలలో ఫోటోలు షేర్ చేసేటప్పుడు ఆలోచించి పోస్టు చేయాలని అన్నారు. అదే విధంగా పోస్ట్ చేసే ఫోటోలు ప్రైవసీలో ఉండేలా చూసుకోవాలని, సామాజిక మాధ్యమాలలో తెలియని ఫోన్ కాల్స్ వస్తే వాటికి స్పందిచవద్దని పేర్కొన్నారు.