వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ కు షాక్

వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ కు షాక్
  •  అధికార పార్టీ కౌన్సిలర్ల రాజీనామా
  • రేపు పొంగులేటి ఆత్మీయ సమ్మేళనం

ముద్ర ప్రతినిధి, ఖమ్మం: వైరా అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే,  బి ఆర్ఎస్ నాయకులు రాములు నాయక్ కు పొంగులేటి వర్గం తీవ్ర షాక్ ఇచ్చింది. గత ఎన్నికల్లో ప్రస్తుతం ఎమ్మెల్యే రాముల నాయక్ ను మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అండతో గెలిచారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలలో పొంగులేటిని ఎమ్మెల్యే రాముల నాయక్ విభేదించారు. ప్రస్తుతం బిఆర్ఎస్ కు దూరంగా ఉంటున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వైరా నియోజకవర్గంలో తన అనుచర వర్గంతో కార్యక్రమాలను స్పీడ్ పెంచారు. దీంతో అప్రమత్తమైన బిఆర్ఎస్ అధిష్టానం ఈ నియోజకవర్గంలోనే దాదాపు 20 మంది కీలక నేతలను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.

ఏ పార్టీలో చేరనప్పటికీ తన వర్గం నేతగా వైరా ఎమ్మెల్యే అభ్యర్థిగా విజయ భాయ్ ను పొంగులేటి  ప్రకటించారు. సిపిఐ కీలక నేతగా ఉన్న ఆమెను తన శిబిరంలోకి పొంగులేటి చేర్చుకున్నారు. ఇది ఇలా ఉండగా బుధవారం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వైరాలో నియోజకవర్గస్థాయి ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. 24 గంటల ముందే వైరా మున్సిపల్ పాలకవర్గం ఓ కుదుపు కుదిపింది. పలువురు కౌన్సిలర్లు బి. ఆర్. ఎస్. కు రాజీనామా చేస్తున్నట్లు మంగళవారం సాయంత్రం ప్రకటించారు. వైరా మున్సిపాలిటీ 7 వార్డు కౌన్సిలర్  పణీతీ ఉషా, 8 వార్డు కౌన్సిలర్ కన్నగంటీ సునీత, 20 వార్డు కౌన్సిలర్ లక్ష్మి బాయ్, బీఆర్ యస్  వైరా పట్టణ అధ్యక్షుడు  రాజశేఖర్ లు, పలువురు వార్డు అద్యక్షులు పార్టీ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు మీడియా సమావేశంలో వెల్లడించారు. ఇక నుంచి పొంగులేటి వర్గంలో కొనసాగుతామని స్పష్టం చేశారు. ఇప్పటికే మున్సిపల్ చైర్మన్ జైపాల్ పొంగులేటి వర్గంగా కొనసాగుతున్న విషయం విధితమే.