షాపింగ్​చేస్తున్నారా!

షాపింగ్​చేస్తున్నారా!
Shopping Tips For Best Discounts

ఒకప్పుడు షాపింగ్​ అనేది పెద్ద ప్రహసనం.. షాపులకు వెళ్లి తిరుగుతూ నచ్చినది దొరికే వరకు వెతికేవారు. కానీ ఇప్పుడు అలా కాదు.. ఆన్​లైన్​ షాపింగ్​ వచ్చేసింది. చేతిలో మొబైల్​ ఉంటే చాలు.. అన్ని షాపులూ కళ్లముందు ఉన్నట్లే..  ప్రత్యేక సందర్భమంటూ ఏమీ లేకున్నా షాపింగ్​ చేసేస్తుంటారు. మరికొందరు పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో షాపింగ్​ చేస్తుంటారు. ఏదిఏమైనా షాపింగ్​ చేసేటప్పడు డబ్బు వృథా కాకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలను పాటించాలి. 

  • దుస్తుల ట్రెండ్​ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. ఒకేరకమైన దుస్తులు లాటుగా కొనేకంటే తక్కువ జతలను కొనడం ఉత్తమం. మరోసారి అప్పటి ట్రెండ్​ను అనుసరించి కొనుక్కోవచ్చు. 
  • ఆన్​లైన్​ షాపింగ్​ చేసేకంటే.. షాపుకు వెళ్లి బట్టలు కొనుక్కోవడం మేలు. నచ్చిన డిజైన్​, నచ్చిన రంగును ఎంపిక చేసుకోవచ్చు.   దుస్తుల నాణ్యతను కూడా స్వయంగా పరిశీలించవచ్చు. 
  • షాపింగ్​ చేసే ముందే బడ్జెట్​ను ఫిక్స్​ చేసుకోవాలి. అంతలోనే షాపింగ్​ చేయాలి. షాప్​కు వెళ్లిన తరువాత అధిక ధర ఉన్నవి నచ్చాయని ఎక్కువ ఖరీదు పెట్టి కొంటే తరువాత ఇబ్బంది పడాల్సి వస్తుంది. 
  • షాపింగ్​కు వెళ్లేముందు ఏవి కొనాలో స్పష్టత ఉండాలి.  ఇంట్లో ఉన్న బట్టల రంగులను చూసుకుంటే షాపింగ్​లో తికమకలు ఉండవు. 

  • ఒత్తిడిగా ఉన్నప్పుడు, సమయం లేనప్పుడు షాపింగ్​ చేయకూడదు. హడావుడిలో ఏవి ఎంచుకుంటున్నామో తెలియకుండా కొనేస్తాం. 
  • చాలామంది షాపింగ్​ చేస్తున్నప్పుడు రాయితీలను దృష్టిలో పెట్టుకుని అవసరమున్నా, లేకున్నా కొంటుంటారు. ఏదైనా కొంటున్నప్పుడు వాటి నాణ్యత, అవి ఎంతవరకు అవసరం అనే విషయాలను గమనించుకోవాలి.
  • ఆన్​లైన్​ షాపింగ్​ చేసేటప్పుడు అదనపు చార్జీలు పడుతున్నాయా, లేదా అని చూసుకోవాలి.