స్పాట్ కు డుమ్మా కొట్టిన 62 మంది ఉపాధ్యాయులకు షో కాజ్ నోటీసులు - డీ ఈ ఓ డాక్టర్ రవీందర్ రెడ్డి

స్పాట్ కు డుమ్మా కొట్టిన 62 మంది ఉపాధ్యాయులకు షో కాజ్ నోటీసులు -  డీ ఈ ఓ డాక్టర్ రవీందర్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, నిర్మల్:స్పాట్ విధులకు హాజరు కాని 62 మంది స్పెషల్ అసిస్టెంట్లకు షోకాజ్  నోటీసులు జారీ చేసినట్లు డీ ఈ ఓ డాక్టర్ రవీందర్ రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని సెయింట్ థామస్  పాఠశాలలో నిర్వహిస్తున్న ఎస్ఎస్సి పరీక్షల స్పాట్  విధులు కేటాయించబడ్డ స్పెషల్ అసిస్టెంట్లు 62 మంది ఇప్పటివరకు క్యాంపులో రిపోర్ట్ చేయలేదన్నారు. వీరంతా శనివారం ఉదయం 9 గంటల లోపు మూల్యాంకన కేంద్రంలో హాజరుకావాలన్నారు. లేని పక్షంలో వేతనం నిలుపుదల తప్పదని ఆయన హెచ్చరించారు.  మూల్యాంకన విధులు కేటాయించబడ్డ ప్రతి ఉపాధ్యాయుడు మూల్యాంకన కేంద్రంలో రిపోర్ట్ చేయాలని ఆయన సూచించారు. జిల్లాకు 1.41 లక్షల పేపర్లు వచ్చాయని, మూల్యాంకనం 13 వరకు కొనసాగుతుందని ఆయన తెలియ జేశారు.