జగిత్యాల జిల్లాలో16 మంది ఎస్సైల బదిలీలు

జగిత్యాల జిల్లాలో16 మంది ఎస్సైల బదిలీలు

ముద్ర ప్రతినిధి, జగిత్యాల : జిల్లాలో పనిచేస్తున్న 16 మంది ఎస్ ఐ లను వివిధ పోలీస్ స్టేషన్ లకు బదిలీ చేస్తూ జగిత్యాల జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. బుగ్గారంలోఎస్సైగా విధులు నిర్వహిస్తున్న ఎస్.సందీప్ కొడిమ్యలకు, కోడిమ్యాలలో పనిచేస్తున్న వెంకట్రావు జగిత్యాల డి సి ఆర్ బి కి,

 జగిత్యాల డి ఎస్ బి ఏ అనిల్ వెల్గటూర్ కు వెల్గటూర్ ఎస్సై కె. శ్వేత కోరుట్ల ఎస్సై2 గా కోరుట్లలో ఉన్న ఇంద్రసేనారెడ్డి జగిత్యాల టౌన్ ఎస్సై -2 గా బదిలీ అయ్యారు. ధర్మపురి ఎస్సై 2 రామకృష్ణ పెగడపల్లికి

పెగడపల్లిలో విధులు నిర్వహిస్తున్న చిర్ర సతీష్ గొల్లపల్లి కి,గొల్లపల్లిఎస్సై నరేష్ కుమార్ జగిత్యాల సి సి ఎస్ కు,

జగిత్యాల డి ఎస్బి లో పనిచేస్తున్న శ్రీధర్ రెడ్డి బుగ్గారం కు, కథలాపూర్ ఎస్సై

 పి. కిరణ్ కుమార్ మల్లాపూర్ కు.ఇక్కడ పనిచేస్తున్న నవీన్ కుమార్ కథలాపూర్ కు బదిలీ అయ్యారు.

జగిత్యాల టౌన్ ఎస్సై అబ్దుల్ రహీం మల్యాల ఎస్సై 1,ఇక్కడ పనిచేస్తున్న తీగెల 

 అశోక్ డిఎస్బి జగిత్యాలకు, ధర్మపురిలో పనిచేస్తున్న ఎస్సై పి. దత్తాద్రి జగిత్యాల టౌన్ 1 గా,

  నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ రెంజల్ ఎస్సై ఉదయ్ కుమార్ ధర్మపురి ఎస్సై 1 గా,

 నిర్మల్ జిల్లా మామడ ఎస్సై శ్రీకాంత్ డిఎస్బి జగిత్యాలకు బదిలీ చేస్తూ జిల్లా ఎస్పీ ఉత్తర్వులు జారీచేశారు.