సింపుల్ సిటీకి మారుపేరు చిన్నన్న

సింపుల్ సిటీకి మారుపేరు చిన్నన్న

 చెట్టుకిందె భోజనం చేస్తున్న ఏఐసీసీ కార్యదర్శి
 ముద్ర ప్రతినిధి, వనపర్తి : వనపర్తి జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన హత్ సే హత్ జోడో అభియాన్ కార్యక్రమంలో భాగంగా నంది హిల్స్ లో ఇంటింటికి తిరిగిన మాజీ మంత్రి, ఏఐసీసీ కార్యదర్శి , టిపిసిసి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి కార్యకర్తలతో కలిసి చెట్టుకింద భోజనం చేయడం కనిపించింది. దానిని చూసిన పట్టణవాసులు మొదటి నుంచి ఎలాంటి హంగులు, ఆర్భాటాలు లేకుండా సింపుల్ సిటీగా జీవనం గడుపుతున్న చిన్నారెడ్డి రాజకీయాల్లో అందరికీ ఆదర్శమని చర్చించడం జరిగింది.

60 సంవత్సరాలు దాటిన చిన్నారెడ్డి కాంగ్రెస్ జెండాను భుజాన వేసుకొని ఇంటింటికి తిరుగుతుండడం అందరినీ ఆకర్షిస్తుంది. అవినీతి,  అక్రమాలు, గ్రూపు రాజకీయాలకు దూరంగా ఉంటూ మచ్చలేని నాయకుడిగా పేరొందిన చిన్నారెడ్డి ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ అభ్యర్థికి ఓట్లు వేసి గెలిపించాలని కోరుతున్నాడు. జిల్లా అధ్యక్షులు రాజేంద్రప్రసాద్, పట్టణ అధ్యక్షులు చీర్ల చందర్,  కాంగ్రెస్ పార్టీ ఓబిసి సెల్ జిల్లా చైర్మన్ కోట్ల రవి,  జాన్, అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు.