1300 కోట్లతో స్మార్ట్ సిటీ వర్క్స్

1300 కోట్లతో స్మార్ట్ సిటీ వర్క్స్
  • శివారు ప్రాంతాలు, విలీన గ్రామాలకు ప్రథమ ప్రాధాన్యత
  • మేయర్ యాదగిరి సునీల్ రావు

ముద్ర ప్రతినిధి కరీంనగర్ :  1300 కోట్లతో స్మార్ట్ సిటీ పనులు కొనసాగుతున్నాయని, నగరంలో అన్ని డివిజన్లను సమానంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ముందుకు వెళుతుందని నగర మేయర్ యాదగిరి సునీల్ రావు అన్నారు. స్మార్ట్ సిటీ అభివృద్ధి లో భాగంగా గురువారం  31 వ డివిజన్ తో పాటు శివారు ప్రాంతాల్లో పర్యటించారు. ఆ ప్రాంతాల కాలనీల్లో పాదయాద్ర చేస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. శివారు ప్రాంతాల డ్రైనేజీ, సీసీ రోడ్ల సమస్యలు త్వరలోనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని స్థానిక ప్రజలకు హామీ ఇచ్చారు. సమస్యల పరిష్కారం పై నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ఈ సందర్బంగా మేయర్ యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ మంత్రి గంగుల కమలాకర్, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ వినోద్ కుమార్ సూచనల మేరకు శివారు ప్రాంతాలు, విలీన గ్రామాల డివిజన్ల ను అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. నగరంలోని అన్ని డివిజన్లను సమానంగా అభివృద్ధి చేసేందుకు నగరపాలక సంస్థ ద్వారా పెద్ద ఎత్తన  నిధులు కేటాయిస్తూ దశల వారిగా పనులు చేస్తున్నామని తెలిపారు. నిధులకు ఎక్కడ కొరత లేకుండా వివిధ గ్రాంట్ల రూపంలో వచ్చిన నిధులను నగర అభివృద్ధి కి కేటాయించి పనులు చేస్తున్నామన్నారు.

1300 కోట్ల రూపాయల నిధులతో నగరంలో పెద్ద ఎత్తున చేపట్టిన అభివృద్ధి పనులు ప్రతి డివిజన్ లో కొనసాగుతున్నాయన్నారు. చేపట్టిన పనుల్లో ఇప్పటికే 80 శాతం పనులు పూర్తయ్యాయని మిగిలిన పనులను జూన్ మాసం లోగా పూర్తి చేసేందుకు చర్యలు తీస్కుంటున్నట్లు తెలిపారు. అంతే కాకుండా శివారు ప్రాంతాలు, విలీన గ్రామాల డివిజన్ల లో కూడ అభివృద్ధి పనులు చేపట్టి దశలవారీగా పూర్తి చేస్తున్నామన్నారు. ప్రతి డివిజన్ లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు ఏర్పాటు చేస్తూ మంచి నీటి పైపులైన్ పనులు కూడ చేయడం జరుగుతుందన్నారు. నూతంగా మరో 50 కోట్ల రూపాయల నిధులతో టెండర్లు పూర్తి చేసి పనులు ప్రారంభిస్తూ పూర్తి చేసేందుకు చర్యలు తీస్కుంటున్నామని తెలిపారు. అంతే కాకుండా మరో 130 కోట్ల రూపాయల నిధులతో డివిజన్ల లో అభివృద్ధి పనులు చేసేందుకు చర్యలు చేపట్టి టెండర్లు పూర్త్ పూర్తి చేసి పనులు ప్రారంభించేదుకు చర్యలు తీస్కుంటున్నామన్నారు.

నగరంతో సమానంగా శివారు ప్రాంతాలను, విలీన గ్రామాల డివిజన్ల ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి.. ప్రజలకు కావల్సిన మౌలిక సదుపాయలన్ని కల్పిస్తున్నట్లు తెలిపారు. కరీంనగర్ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యం గా మా పాలకవర్గ పనిచేస్తూ ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడం జరుగుతుందన్నారు. మంత్రి గంగుల కమలాకర్, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ వినోద్ కుమార్ ల సహకారంతో నగరాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి రాష్ట్రంలో రెండో గొప్పనగరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పోరేటర్ లెక్కల స్వప్న వేణు, నగరపాలక సంస్థ అధికారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.