తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కీలకంగా వ్యవహరించిన సోషల్ మీడియా. 

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కీలకంగా వ్యవహరించిన సోషల్ మీడియా. 
  • తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సోషల్ మీడియా కోఆర్డినేటర్ పెట్టం నవీన్


తుంగతుర్తి ముద్ర:-తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి సోషల్ మీడియా విభాగం కీలకంగా వ్యవహరించిదని వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో రాహుల్ గాంధీని  ప్రధాని చేసే లక్ష్యంగా కాంగ్రెస్ సోషల్ మీడియా పనితీరు ఉండాలని రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ పెట్టం నవీన్ అన్నారు. బుధవారం తుంగతుర్తి మండల కేంద్రంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా సమీక్ష సమావేశంలో నవీన్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేసే ఆరు గ్యారెంటీలను పథకాలను విస్తృతంగా గ్రామాల్లోకి  సోషల్ మీడియా ద్వారా తీసుకువెళ్లాలని అన్నారు.

ఈ కార్యక్రమానికి వచ్చిన గ్రామ కోఆర్డినేటర్లతో సోషల్ మీడియా బలోపేతానికి కృషి చేయాలని అన్నారు.వచ్చే పార్లమెంట్ ఎలక్షన్ లో గెలుపుకు మరింత బలంగా సోషల్ మీడియా ద్వారా కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని అన్నారు.ఈ కార్యక్రమంలో భువనగిరి పార్లమెంట్ సోషల్ మీడియా ఇంచార్జ్ భార్గవ్, తెలంగాణ స్టేట్ యువజన కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ కొండరాజు, తుంగతుర్తి నియోజకవర్గ సోషల్ మీడియా కోఆర్డినేటర్ రామడుగు నవీన్, తుంగతుర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొంగరి గోవర్ధన్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు తిరుమల ప్రగడ కిషన్ రావు, జిల్లా కాంగ్రెస్ నాయకులు పెద్ద బోయిన అజయ్, అక్కినపల్లి నరేష్, ఎండి అబ్దుల్, తుంగతుర్తి పట్టణ శాఖ అధ్యక్షుడు ఉప్పుల రాంబాబు, ఎస్కే హుస్సేన్,అక్కినపల్లి రాములు, సిద్ధిక్, 9 మండలాల కోఆర్డినేటర్లు, గ్రామ కోఆర్డినేటర్లు పాల్గొన్నారు.