తండ్రి పై కొడుకు కత్తితో దాడి...

తండ్రి పై కొడుకు కత్తితో దాడి...
  • ఆసుపత్రికి తరలింపు..

మెట్‌పల్లి ముద్ర :- కుటుంబ కలహాలతో తండ్రి పై కొడుకు కత్తితో దాడికి దిగిన ఘటన మెట్‌పల్లి పట్టణంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మున్సిపల్ పరిధిలోని ఆరపేటలో రిజ్వాన్ ఖాన్ అనే వ్యక్తిపై కొడుకు అక్బర్ ఖాన్ కత్తితో దాడికి పాల్పడ్డాడు. అయితే గత కొద్ది రోజులుగా అక్బర్ ఖాన్ భార్య  మనస్పర్ధలతో తల్లిదండ్రుల వద్ద ఉంటుంది.

అయితే బుధవారం నా భార్య నాకు కావాలని అక్బర్ ఖాన్ తల్లిదండ్రుల పై గొడవకు దిగగా తల్లిని కత్తితో పొడిచే క్రమంలో తండ్రి రిజ్వాన్ ఖాన్ అడ్డుపడగా రిజ్వాన్ ఖాన్ కు ఛాతి కింద కడుపులో గాయాలు కావడంతో హుటాహుటిన పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. ఈ ఘటన పై బాధితుని కొడుకు జుబేర్ ఖాన్ ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ ఐ చిరంజీవి తెలిపారు.