తండ్రిని చంపిన తనయుడు

తండ్రిని చంపిన తనయుడు

ముద్ర ప్రతినిధి, వనపర్తి :- వనపర్తి మండలం చిమన గుంటపల్లి గ్రామంలో సోమవారం తెలుగు బుచ్చయ్య (80) నీ సొంత కుమారుడైన పెద్ద కురుమయ్య దారుణంగా నరికి చంపిన అమానుష సంఘటన జరిగింది. వనపర్తి రూరల్ ఎస్సై నాగన్న తెలిపిన వివరాల ప్రకారం పెద్ద కురుమయ్య బాధ్యత లేకుండా తిరిగేవాడని అతనికి తండ్రి బుచ్చయ్యను అన్నం పెట్టి పోషించడం ఇష్టం లేక బాధ్యతను వదిలించుకోవడానికి ఈ దారుణానికి వడిగట్టినట్లు ఆయన తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు పోస్టుమార్టం నిమిత్తం వనపర్తి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించామని మంగళవారం పోస్టుమార్టం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.