సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించిన కాంగ్రెస్ శ్రేణులు

సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించిన కాంగ్రెస్ శ్రేణులు

తుంగతుర్తి ముద్ర: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భా వానికి కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఏ కారణమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు బాలలక్ష్మి అన్నారు శుక్రవారం తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రాల్లో స్థానిక మెయిన్ రోడ్డు పై సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం మాట్లాడారు .తెలంగాణ ప్రజల ఆకాంక్షను గుర్తించిన సోనియా గాంధీ ప్రజల అభీష్టాన్ని గౌరవిస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగిందని అన్నారు .తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అభివృద్ధి కోసం జరిగితే నేడు తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి తీరోగమనంలో ఉందని, తిరిగి తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని అన్నారు.

రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీకి తెలంగాణ ప్రజలు రుణపడి ఉన్నారని ,రానున్న ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ జెండా ఎగరవేసి సోనియాగాంధీ రుణం తీర్చుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఉత్సవ కమిటీ సభ్యులు ఏ. జ్ఞాన సుందర్, పిసిసి మెంబర్ నరసయ్య, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు తిరుమల ప్రగడ కిషన్ రావు , మండల పార్టీ అధ్యక్షుడు దొంగరి గోవర్ధన్, ఎన్ ఎస్ యు ఐ నాయకులు కొండరాజు లతోపాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.