ప్రజా పాలనకు విశేష స్పందన

ప్రజా పాలనకు విశేష స్పందన

ముద్ర.వీపనగండ్ల:-రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన కార్యక్రమానికి గ్రామాలలో విశేష స్పందన లభిస్తుంది. అర్హులైన ప్రతి ఒక్కరికి అభయ హస్తం పథకం ద్వారా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను ప్రజలకు అందించాలనే లక్ష్యంతో గ్రామాలలో ప్రజాపాలన కార్యక్రమాన్ని చేపట్టి ప్రజల నుంచి అధికారులు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. మొదటిరోజు మండల పరిధిలోని రంగవరం, వల్లభాపురం తండా, నాగర్లబండా తండ, కొర్లకుంట కార్యక్రమాన్ని ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు.

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు 6 గ్యారంటీల ద్వారా మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు 2500 రూపాయలు ఆర్థిక సహాయం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, రైతు భరోసా పథకం ద్వారా రైతులకు కౌలు రైతులకు ఎకరానికి 15 వేల రూపాయలు, వ్యవసాయ కూలీలకు ప్రతి సంవత్సరం 12000 వేలు, ఇండ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు, తెలంగాణ అమరవీరులకు, ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం, గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల ఉచిత విద్యుత్, చేయత పతకం ద్వారా నాలుగు వేల రూపాయల పెన్షన్ అందిస్తున్నట్లు మేనిఫెస్టో ప్రకటించిన విషయం తెలిసిందే. కార్యక్రమంలో తాసిల్దార్ వరలక్ష్మి, ఎంపీడీవో కథలప్ప, ఎంపిఓ శ్రీనివాస్, మండల వైద్యాధికారి డాక్టర్ వంశీకృష్ణ, డాక్టర్ రాజశేఖర్, ఏఎస్ఐ చంద్రారెడ్డి,ఏపీఓ శేఖర్ గౌడ్ తదితరులు ఉన్నారు.