క్రీడలు మానసిక ఉల్లాసాన్నిస్తాయి

క్రీడలు మానసిక ఉల్లాసాన్నిస్తాయి
  • తెలంగాణ ప్రభుత్వం క్రీడాకారులను  ప్రోత్సహించడంలో ముందంజ
  • సీఎం కప్ క్రీడలను ప్రారంభించిన ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి

హుజూర్ నగర్, ముద్ర: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణప్రాంత క్రీడాకారులను ప్రోత్సహించడంతోపాటు  వారి నైపుణ్యాన్ని వెలికితీయాలనే ఉద్దేశంతో  సీఎం కప్ -2023 క్రీడా కార్యక్రమాలను చేపట్టామని హుజూర్నగర్ శాసనసభ్యులు  శానంపూడి సైదిరెడ్డి  అన్నారు. సోమవారం హుజూర్నగర్ పట్టణ కేంద్రంలోని ఎన్ఎస్పి క్యాంప్ లోని  జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు మండల స్థాయి క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సీఎం కప్ క్రీడలను ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు.  తొలిత క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు.ఈసందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ....15 ఏళ్ల నుంచి 36 ఏళ్లు వయసు ఉన్న యువతి యువకులు సీఎం కప్ పోటీలో పాల్గొనేందుకు అర్హులని ఆయన పేర్కొన్నారు, నేటి నుండి 17వ తేదీ వరకు మండల స్థాయిలో క్రీడాలు జరుగుతాయని ఆయన అన్నారు.జిల్లా స్థాయిలో గెలుపొందిన జట్లు రాష్ట్రస్థాయిలో నిర్వహించే పోటీలలో పాల్గొంటారని ఆయన తెలిపారు.క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తున్నాయని అన్నారు శారీరక శ్రమతో కూడిన క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తున్నాయని అన్నారు.

సీఎం కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో దూసుకుపోతుంది అన్నారు అన్ని రకాల క్రీడలను అనుకూలంగా పనిచేసే క్రీడాలకు క్రీడా రంగానికి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు.క్రీడాకారులు మంచిగా ఆడి జాతీయ స్థాయిలో విజయం సాధించడానికి దేశానికి మన తెలంగాణ రాష్ట్రానికి సీఎం కేసీఆర్ గారికి మంచి పేరు తేవాలని కోరారు. నాకు క్రీడలు అంటే ఇష్టం అని క్రీడలకు క్రీడాకారులకు నా వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు.ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణం ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేసింది అన్నారు రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులకు సదుపాయాలు కల్పించి వారి నైపుణ్య ప్రదర్శించే అవకాశం కల్పించింది అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ గూడెపు శ్రీనివాసు, జెడ్పిటిసి కొప్పల సైదిరెడ్డి ,ఎంపీడీవో శాంతకుమారి, ఎంఈఓ సైదా నాయక్, పోలీసు సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు బెల్లంకొండ రామచంద్ర గౌడ్ పాల్గొన్నారు.