బండి సంజయ్ కి నోటీసులు జారీ చేసిన రాష్ట్ర మహిళా కమిషన్

బండి సంజయ్ కి నోటీసులు జారీ చేసిన రాష్ట్ర మహిళా కమిషన్

మార్చి 15న వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలి: రాష్ట్ర మహిళా కమిషన్

హైదరాబాద్ ముద్ర న్యూస్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీత లక్ష్మా రెడ్డి  సోమవారం నోటీసులు జారీ చేసింది. మార్చి 15వ తేది బుధవారం ఉదయం 11.00 గంటలకు కమిషన్ ఎదుట హాజరుకావాలని బండి సంజయ్ కి సూచించింది. బీఅర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను సుమోటోగా తీసుకున్న మహిళా కమిషన్ ఈ మేరకు నోటీసులు జారీ చేసింది.

ఎమ్మెల్సీ కవిత పై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యకలకు వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. మార్చి 15వ తేదీన రాష్ట్ర మహిళా కమిషన్ కార్యాలయంలో వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. మహిళా కమిషన్ ముందు హాజరుకాకపోతే తదుపరి చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.