అభివృద్ధికి చిరునామా కెసిఆర్ పాలన

అభివృద్ధికి చిరునామా కెసిఆర్ పాలన
  • రాష్ట్ర ఫిల్మ్ డెవలప్మెంట్ చైర్మన్ అనిల్ కూర్మాచలం

ముద్ర ప్రతినిధి, నిర్మల్:అభివృద్ధి లో అగ్రగామిగా ఉన్న తెలంగాణా దేశాన్ని ఆకర్షిస్తుందని, అభివృద్ధి అంటేనే కెసిఆర్ అని రాష్ట్ర చలన చిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్ అనిల్ కూర్మాచలం, పలు దేశాల్లో ఉంటున్న ఎన్నారై లు అన్నారు. మంత్రి అల్లోల క్యాంప్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధికి నిదర్శనం వివిధ సంస్థలు విడుదల చేస్తున్న గణాంకాలే సాక్ష్యమని అన్నారు. పెట్టుబడులను ఆకర్షించి, వివిధ  కార్యాలయాల ద్వారా ఉద్యోగాలు కల్పిస్తున్న తీరు పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. రైతు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఫలితంగా గతంలో గల్ఫ్ దేశాలకు వలస వెళ్ళే రైతాంగం నేడు వ్యవసాయం చేసి ఆదర్శంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. ఈ అభివృద్ధి నిరంతరం కొనసాగేందుకు బీ ఆర్ ఎస్ విజయం కోసం తమ పనులు వదలి మద్దతు ప్రకటించేందుకు వచ్చామని వారు వివరించారు. రాబోయే ఎన్నికల్లో అధికార పార్టీకి మరోసారి పట్టం కట్టాలని కోరారు.