విశ్రాంత ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం అండ

విశ్రాంత ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం అండ
  • విశ్రాంత ఉద్యోగుల సమస్య పరిష్కారానికి సహాయ సహకారాలు అందిస్తా
  • ఎమ్మెల్యే మందుల సామెల్
  • ఎమ్మెల్యే సామెల్ చేతుల మీదుగా పెన్షనర్ పితామహుడు డి ఎస్ నకార విగ్రహావిష్కరణ


తుంగతుర్తి ముద్ర:- వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ సమయంలో ప్రజలకు అనేక సేవలు అందించి విరమణ పొందిన  విశ్రాంత ఉద్యోగులకు  కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ అన్నారు. మండల కేంద్రంలోని పెన్షనర్‌ భవనంలో శుక్రవారం  పెన్షనర్‌ పితామహుడు డీఎస్‌ నకార విగ్రహాన్ని ఎమ్మెల్యే చేతుల మీదుగా ఆవిష్కరించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విశ్రాంత ఉద్యోగుల కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టనుందన్నారు.ఇందులో భాగంగానే విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం ఎప్పుడూ ముందుందని పేర్కొన్నారు. వారి ఆరోగ్య పరిస్థితులను ముఖ్యమంత్రి తో పాటు సంబంధిత మంత్రి దృష్టికి తీసుకు వెళ్తానని తెలిపారు.

నకార విశ్రాంత ఉద్యోగుల కోసం పోరాడిన మహనీయుడని విశ్రాంత ఉద్యోగుల పట్ల ప్రభుత్వానికి స్పష్టమైన అవగాహన కలిగి ఉందని సమస్యల పరిష్కారానికి నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు. మందుల సామేల్ మర్యాద కల్లోడని ఆలోచించి నాకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించిన మీ మర్యాదను నేను కాపాడుకుంటూ మీ సలహాలు మీ దీవెనలు తీసుకుంటూ ముందుకు వెళ్తానన్నారు.అనంతరం విశ్రాంత ఉద్యోగుల సంఘం మండల, జిల్లా అధ్యక్షులు పి. సంతోష్, సుదర్శన్ రెడ్డిలు  మాట్లాడుతూ.. విశ్రాంత ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కోసం అందరూ ఐక్యంగా ఉండాలని కోరారు. ఈ మేరకు ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదటిసారి విశాంత భవనానికి వచ్చిన సందర్భంగా మందుల సామెల్ ను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, విశ్రాంత ఉద్యోగుల భవన నిర్మాణ దాత సంకినేని స్వరూప రవీందర్ రావు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దొంగరి గోవర్ధన్, జిల్లా నాయకులు తిరుమల ప్రగడ కిషన్ రావు, ఓరుగంటి సత్యనారాయణ, విశ్రాంత ఉద్యోగులు పుల్లయ్య, యాదగిరి,సుధాకర్ రెడ్డి,రవీందర్ రెడ్డి,సూదగాని రాజయ్య, చిత్తలూరి సోమయ్య, తాటి విజయమ్మతో పాటు తదితర విశ్రాంత ఉద్యోగులు పాల్గొన్నారు.