బిగ్ బ్రేకింగ్ న్యూస్ - ఖమ్మంలో ఉద్రిక్తత... హరీష్ రావు వాహనం పై రాళ్ల దాడి..!
వరద బాధితులను పరామర్శించడానికి బీఆర్ఎస్ ముఖ్యనేతలు ఖమ్మం పట్టణంలోని మున్నేరు ప్రాంతానికి వెళ్లడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ నాయకుల వాహనాలపై రాళ్లదాడి జరిగింది. హరీష్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, నామా నాగేశ్వరరావును అడ్డుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు.. గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. వారి కార్లపై కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్లు విసిరారు. ఓ బీఆర్ఎస్ కార్యకర్త కాలికి గాయమైంది. విరిగినట్లు తెలుస్తుండగా. ఈ దాడిలో నామా నాగేశ్వర రావు కారు ధ్వంసం అయింది.