అక్రమ ఇసుక రవాణా చేసే వారిపై కఠిన చర్యలు: జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్

అక్రమ ఇసుక రవాణా చేసే వారిపై కఠిన చర్యలు: జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్

ముద్ర ప్రతినిధి,  వనపర్తి : జిల్లాలో అక్రమ ఇసుక రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ తేజస్సు నందులాల్ పవర్ హెచ్చరించారు. సోమవారం ఐడిసిఓ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.  ప్రభుత్వం గుర్తించిన ఇసుకరీచుల నుండి మాత్రమే ఇసుకను రవాణా చేయాలని ఆదేశించారు. ఇసుక ట్రాక్టర్లు పరిమిత బిల్లులను పొంది ఇసుకను తరలించాలని సూచించారు.  పెబ్బేరు మండలం రామమ్మపేట.  కిల్లాగణపురం మండలంలోని కమలౌద్దిన్ పూర్,  అంతాయిపల్లి గ్రామంలో ఇసుకరీచులు ఉన్నాయని ఆయన తెలిపారు.

మన ఊరు మనబడి కి,  ప్రభుత్వం అవసరాలకు మాత్రమే ఇసుకను వినియోగించాలని కలెక్టర్ ఆదేశించారు.  అన్ని ట్రాక్టర్లకు ట్రాకింగ్ ఏర్పాటు చేయాలని,  చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.  ప్రభుత్వ పనులకు 24 గంటల్లోపు ఇసుక రవాణా చేస్తామని తెలిపారు. ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో చెక్ పోస్టులు ఏర్పాటు చేయిస్తున్నట్లు ఇల్లీగల్ ఇసుక రవాణాను అరికడతానని తెలిపారు. ప్రతి ఇసుక రీచ్ లో సీసీటీవీలు ఏర్పాటు చేయాలన్నారు. ఫిల్టర్ ఇసుక పై కఠిన చర్యలు తీసుకుంటామని,  వెహికిలను బైండోవర్ చేయాలని,  ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్, ఆర్డిఓ పద్మావతి,  డిఎస్పి ఆనంద్ రెడ్డి,  మైనింగ్ శాఖ ఏడి విజయరామరాజు,  ఏవో రాజేందర్ గౌడ్,  పి ఆర్ ఈ ఈ మల్లయ్య,  ఎమ్మార్వోలు తదితరులు పాల్గొన్నారు.