ప్రజా పాలన దరఖాస్తులను విక్రయిస్తే కఠిన చర్యలు - తాసిల్దార్ వరలక్ష్మి

ప్రజా పాలన దరఖాస్తులను విక్రయిస్తే కఠిన చర్యలు  - తాసిల్దార్ వరలక్ష్మి

ముద్ర.వీపనగండ్ల:- ప్రజా పాలన కు సంబంధించిన దరఖాస్తులను జిరాక్స్ సెంటర్ యజమానులు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని తాసిల్దార్ వరలక్ష్మి హెచ్చరించారు. మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో కొందరు జిరాక్స్ సెంటర్ యజమానులు ప్రజాపాలన దరఖాస్తులను జిరాక్స్ కాపీలు చేసి విక్రయిస్తున్నారని పలు పత్రికల్లో వార్తలు రావడంతో తాసిల్దార్ స్పందించారు. ప్రజలు దరఖాస్తు చేసుకోవడానికి దరఖాస్తు ఫారాలు గ్రామాలలో పంచాయతీ కార్యదర్శుల వద్ద,ఎంపీడీవో కార్యాలయంలో అందుబాటులో ఉన్నాయని, దరఖాస్తు ఫారం కావలసినవారు వారి వద్దకు వెళ్లి తీసుకోవాలని సూచించారు. ఇప్పటికే గ్రామాలలో ప్రజాపాలన కార్యక్రమాన్ని కంటే రెండు రోజుల ముందుగానే పంచాయతీ కార్యాలయంలో ప్రజలకు ఉచితంగా అందించడం జరిగిందని తెలిపారు. ఇప్పటికైనా జిరాక్స్ సెంటర్ యజమానులు ప్రజా పాలన దరఖాస్తులను విక్రయించటం మానుకోవాలని, లేనిచో చర్యలు తప్పవని అన్నారు.