మణిపూర్ లో  హింసకాండ కు  పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.

మణిపూర్ లో  హింసకాండ కు  పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.

 సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి  డిమాండ్ 
 ముద్ర ప్రతినిధి సూర్యాపేట:  మణిపూర్ లో హింసకాండ కు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి   శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.  మణిపూర్ లో కుకి మహిళలను వివస్రతను చేసి లైంగిక దాడి జరిపి, వారిని నగ్నంగా ఊరేగించి  అత్యాచారాన్ని చేసి హత్య చేసినఇద్దరిపై  వెంటనేకేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో చెలరేగుతున్న హింసను నివారించి శాంతియుత, సాధారణ పరిస్థితి లు నెలకొనేలా చర్యలు చేపట్టాలని కోరారు. మణిపూర్ రాష్ట్రంలో పరిస్థితిని అదుపు చేయడంలో బిజెపి  డబల్ ఇంజన్ సర్కార్   పూర్తిగా వైఫల్యం చెందిందని విమర్శించారు. మణిపూర్ పరిస్థితిలపై వ్యాఖ్యానించడానికి, స్పందించడానికి కూడా దేశ ప్రధానికి ఇన్ని రోజులు  సమయం పట్టిందా అనిప్రశ్నించారు. చివరకు సుప్రీంకోర్టు స్పందించి హింసను నివారించడానికి మీరు చర్యలు తీసుకుంటారా లేక మమ్మల్ని తీసుకోమంటారా అని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన దుస్థితి తలెత్తిందని అన్నారు. 

రాష్ట్రంలో శాంతి భద్రతలను నెలకొల్పడంలో ముఖ్యమంత్రి బీరన్ సింగ్ నేతృత్వంలో బిజెపి ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళన రేకెత్తిస్తున్న ఈ సమస్యను పరిష్కరించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏ మాత్రం తాత్సారం చేసిన ఈ పరిణామాలదుష్ప్రభావం మిగతా ఈశాన్య రాష్ట్రాల పై పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. మణిపూర్ రాష్ట్రంలో జరిగినదుర్మార్గానికి దేశ ప్రధానమంత్రి మోడీ బాధ్యత వహించాలని విమర్శించారు. వెంటనే మణిపూర్ రాష్ట్రంలో శాంతిని నెలకొల్పాలని నాగులకు, కుకి గిరిజనులకు భద్రత కల్పించాలని పేర్కొన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా పై విచారణ చేపట్టాలని కోరారు. అల్లర్లకు గురైన బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. మణిపూర్ రాష్ట్రంలో జరిగిన మొత్తం ఘటనపై సిట్టింగ్ జరిగితో న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేశారు.