అక్రమ స్కానింగ్ లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం

అక్రమ స్కానింగ్ లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం

 మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కె శశాంక 

ముద్రప్రతినిధి,మహబూబాబాద్: అక్రమ గర్భ స్కానింగ్ లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ శశాంక హెచ్చరించారు. మహబూబాబాద్ లో గురువారం ఐడిఓసి లోని కాన్ఫరెన్స్ హాలులో పిసిపిఎన్ డిటి డిస్టిక్ లెవెల్ మల్టీ మెంబర్ అప్రాప్రియట్ అథారిటీ, జిల్లా కలెక్టర్ కె శశాంక ఆధ్వర్యంలో జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శరత్ చంద్ర పవర్ తో కలిసి, జిల్లా వైద్యాధికారి డాక్టర్ బి హరీష్ రాజ్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శశాంక మాట్లాడుతూ సమాజంలో స్త్రీ పురుషులు ఇరువురు సమానమే, స్త్రీ, పురుషుల మధ్య ఏ వివక్షత ఉండకూడదని నిజానికి పురుషుడు కంటే స్త్రీ ఏ విషయంలోనూ తక్కువ కాదని అన్నారు. అందుకే అన్ని రంగాల్లో స్త్రీలు పురుషులతో పోటీపడుతున్నారని, మన సమాజంలో ఆడ శిశువుల పట్ల అనాధారణ ఇంకా తగ్గలేదన్నారు. పుట్టబోయేది ఆడ శిశువు అని తెలియగానే  కొన్ని సందర్భాల్లో గర్భస్రావానికి కొన్ని కుటుంబాలు సిద్ధపడుతున్నాయని, దీన్ని అరికట్టాలన్నారు.

గర్భస్థ పిండపరీక్ష ప్రక్రియ నియంత్రణ మరియు దురుపయోగ నివారణ చట్టం 1994లో రూపొందించడం జరిగిందని, ఈ చట్ట పరిధిలో అన్ని అల్ట్రా సౌండ్ స్కానింగ్ యంత్రాలు లేదా పరికరాలు లేదా లింగనిర్ధారణ చేయగల సామర్థ్యం గల యంత్రాలు, ప్రదేశాలు తప్పనిసరిగా నమోదు చేయించాలన్నారు. మహబూబాబాద్ జిల్లాలో జెండర్ రేషియో తక్కువ ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కేసముద్రం,మల్యాల,మరిపెడ, బలపాల,తొర్రూరు, గంగారం నెల్లికుదురు,కురవిలపై  నిఘా పెంచాలని సూచించారు. ఆర్ఎంపీలకు పీఎంపీలకు, చట్టంపై అవగాహన కల్పించాలని తెలిపారు. ఆడ అయినా మగయిన చెప్పినచో శిక్ష అర్హులు అవుతారని కలెక్టర్ శశాంక చెప్పారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ.. ఆడ మగ అని చెప్పినచో చట్టప్రకారంగా శిక్షకు అర్హులు అవుతారని అన్నారు. ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ఉమా గౌరీ మాట్లాడుతు,మేల్, ఫిమేల్, రేషియో తక్కువ గా ఉన్న పీహెచ్ లకు, అవగాహనా కలిసస్తామని అన్నారు.