ఇంటర్మీడియట్ పరీక్ష పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు

ఇంటర్మీడియట్ పరీక్ష పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు
  • పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు
  • జిల్లా ఎస్పీ చందనా దీప్తి

ముద్ర ప్రతినిధి, నల్గొండ:నేటి నుంచి (ఈ నెల 28 నుంచి) మార్చి 19వ వరకు నిర్వహించే  జిల్లా వ్యాప్తంగా నిర్వహించే ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాల వద్ద అభ్యర్ధులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా ఎస్పీ చందనా దీప్తి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ పరీక్షా కేంద్రాల సమీపంలో ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని, పరీక్ష కేంద్రాల  సమీపంలో ఉన్న అన్ని జిరాక్స్ సెంటర్స్,ఇంటర్ నెట్ సెంటర్స్, అన్ని మూసి వేయాలని ఆదేశించారు. పరీక్షా సెంటర్స్ వద్ద నుండి 500 మీటర్ల వరకు ప్రజలు గుమిగూడ వద్దు అని ఎలాంటి సభలు సమావేశాలు నిర్వహించ కూడదు అని పేర్కొన్నారు. అభ్యర్ధులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా పరీక్ష నిర్వహణకు పటిష్టమైన బందోబస్తు ఉందన్నారు.